ప్రభాస్ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసిన కల్కి ఫైనల్ ట్రైలర్.. ఏంటి బాసు ఇది..!

lakhmi saranya
ప్రెసెంట్ పాన్ ఇండియా లెవెల్ లో రానున్న చిత్రాల్లో కల్కి మూవీ కూడా ఒకటి. ప్రతి ఒక్కరి దృష్టి ఈ సినిమా పైనే ఉంది. పురాణాల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా పై ఇటు ప్రభాస్ అభిమానులతో పాటు మరోపక్క నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ బిగ్ ప్రాజెక్టులో దీపిక పదుకొనే అండ్ దిశా పటాని హీరోయిన్స్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం కి నాగ్ అశ్విన్ డైరెక్షన్ వహించాడు. ఇక ఈ సినిమా విషయంలో మేకర్స్ అభిమానులని వెయిట్ చేస్తే చేస్తున్నారు కానీ మంచి సాలిడ్ కంటెంట్తో ట్రీట్ ఇస్తున్నారు.  
అలా నిన్న ఈ మూవీ అవైటెడ్ ఫైనల్ ట్రైలర్ కట్ ని రిలీజ్ చేయగా ఇందులో సరికొత్త విజువల్స్ కి అయితే ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఈ ట్రైలర్ తో మాత్రం ఒక విషయంలో అభిమానులు సహా సినిమా కోసం ఎదురుచూస్తున్న జనరల్ ప్రేక్షకులు కూడా డిసప్పాయింట్ అయినట్లు తెలుస్తుంది. ఇందులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అండ్ ఎమోషనల్ ట్రాక్ వర్క్ అవుట్ కాలేదని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయన్‌ డిసప్పాయింట్ చేశాడని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
అయితే ఫస్ట్ ట్రైలర్ కి తాను ఎలాంటి స్కోర్ అందించాడు చూసాం సో అతన్ని తక్కువ అంచనా వేయడానికి లేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అయితే ట్రైలర్ బానే ఉన్నప్పటికీ సరైన బ్యాగ్రౌండ్ స్కోర్ లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసింది. ఇక తాజాగా ప్రభాస్ హీరోగా నటించిన సలాడ్ సినిమాలో కూడా ఇదే రిపీట్ అయింది. సినిమా కాన్సెప్ట్ బాగున్నప్పటికీ సరైన బ్యాగ్రౌండ్ స్కోర్ లేకపోవడంతో సినిమాకి ఒకింత నెగిటివ్ టాక్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్లు ఎక్కువగా ఉండడంతో సినిమా అలా అలా నెట్టుకెళ్ళిపోయింది. కానీకల్కి కి సినిమా మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ విధంగానే ఉంటే సక్సెస్ అవడం కష్టం అని చెప్పుకోవచ్చు. ఇంత భారీ బడ్జెట్ తో రూపొందించి భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తున్న ఈ మూవీ టీం కేవలం బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారంటూ పలువురు విరుచుకుపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: