అవకాశాలున్నా... లేకున్నా ఆ విషయంలో అస్సలు తగ్గట్టున్న పూజా హెగ్డే... ఇలా అయితే కష్టమే..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు, తమిళ్, హిందీ సినీ పరిశ్రమలలో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్న నటి మనులలో పూజా హెగ్డే ఒకరు. ఈమె ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది . ఇందులో ఈమె తన నటనతో, అంతకుమించిన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దానితో ఈ మూవీ తర్వాత ఈమెకు వరుసగా తెలుగు లో స్టార్ హీరోలా సినిమాలలో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈమె నటించిన సినిమాలలో చాలా చిత్రాలు మంచి విజయాలను అందుకోవడం, అలాగే ఈమె సినిమాలలో తన అందాలతో ప్రేక్షకులకు ఫుల్ ట్రేట్ ఇస్తూ ఉండడంతో ఈమెకు అవకాశాల జోరు మరింతగా పెరిగింది.

దానితో ఈమె చాలా సంవత్సరాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించింది. ఈ మధ్యకాలంలో ఈమె వరసగా తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలలో సినిమాల్లో నటించినప్పటికీ రీసెంట్ టైంలో ఈమె నటించిన ఏ మూవీ కూడా మంచి విజయం సాధించలేదు. దానితో ఈమె అవకాశాలు కూడా చాలా వరకు తగ్గాయి. చాలా రోజుల తర్వాత ఈ బ్యూటీ సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో హీరోయిన్గా ఎంపిక అయింది. ఈ సినిమా కోసం ఈ బ్యూటీ చాలా రోజులను కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

దానితో ఈనటి ఈ సినిమా కోసం ఏకంగా 4 కోట్ల పారితోషకం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి అవకాశాలు లేకపోయినా ఈ స్థాయి పారితోషకం ఏమిటి అని కొంతమంది అంటూ ఉంటే అవకాశాలు ఉన్నా ... లేకపోయినా పారితోషకం విషయంలో అస్సలు తగ్గేది లేదు అని ఈ బ్యూటీ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా పూజా హెగ్డే కు ఒకటి, రెండు గట్టి విజయాలు దక్కినట్లు అయితే మళ్లీ అదిరిపోయే ఛాన్సులను అందుకుంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: