అదృష్టం అంటే ఈమదే... ఒక హిట్ లేకపోయినా వరుస సినిమాలు..?

MADDIBOINA AJAY KUMAR
ఎంతోమంది నటీమణులు సినీ పరిశ్రమలోకి వస్తున్నారు. అలా వచ్చే వారిలో ఎవరు అయితే కెరీర్ ను ప్రారంభించిన మొదటి ఒకటి, రెండు సినిమాలలో మంచి విజయాలను అందుకుంటారో వారికే మంచి సినిమా అవకాశాలు దక్కుతూ ఉంటాయి. అలా అందుకొని వారిలో ఎక్కువ శాతం మంది తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో కనుమరుగైతారు. కానీ కొంతమంది నటీమణులు మాత్రమే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాక వరుస అపజయాలు దక్కిన కూడా వరుసగా క్రేజీ సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ కెరీర్ ను ముందుకు సాగిస్తుంటారు. 
ప్రస్తుతం ఇలా కెరీర్ను కొనసాగిస్తున్న వారిలో సాక్షి వైద్య ఒకరు.

ఈ బ్యూటీ అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ అనే స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేదు. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. నటించిన మొదటి సినిమానే ఫ్లాప్ కావడంతో సాక్షికి ఆ తర్వాత సినిమా అవకాశాలు తెలుగులో రావడం కష్టం అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందిన గాండీవ దారి అర్జున సినిమాలో ఈ బ్యూటీకి హీరోయిన్గా అవకాశం దక్కింది. ఈ సినిమా కూడా పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడమ విడుదల అయింది.

చివరగా చూస్తే ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. 
ఇలా నటించిన రెండు మూవీలు కూడా ఫ్లాప్ కావడంతో ఈమెకు తెలుగులో ఇకపై అవకాశాలు రావడం కష్టమే అని జనాలు మళ్ళీ అనుకున్నారు. కానీ ఈమెకు మళ్ళీ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈమె శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం శర్వా మంచి ఫామ్ లో ఉండడం, సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతూ ఉండటంతో ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీతో అయినా సాక్షి వైద్య మంచి విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

sv

సంబంధిత వార్తలు: