సూర్య సినిమా కోసం రెమ్యూనరేషన్ భారీగా పెంచిన పూజ హెగ్డే.. ఎంతో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
నాగ చైతన్య హీరోగా రూపొందిన ఒక లైలా కోసం అనే యూత్ ఫుల్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ తో పూజా హెగ్డే తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ మూవీ తర్వాత ఈమెకు మంచి సినిమా అవకాశాలు తెలుగులో రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ హీరోలుగా రూపొందిన సినిమాలలో నటించి చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్లిపోయింది.

ఈ మధ్య కాలంలో ఈమె నటించిన సినిమాలు చాలా వరకు అపజయాలను అందుకుంటూ వస్తున్నాయి. దానితో ఈమె అవకాశాలు కూడా చాలా వరకు పడిపోయాయి. పోయిన సంవత్సరం ఈమె నటించిన ఒక్క తెలుగు సినిమా కూడా విడుదల కాలేదు. ఇక మళ్ళీ ఈమె జోష్ చూపించడానికి రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఈమెకు తెలుగుతో పాటు తమిళ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. తమిళ్ లో సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో "సూర్య 42" అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ కొన్ని రోజుల క్రితమే స్టార్ట్ అయిన విషయం మనకు తెలిసిందే.

ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించబోతుంది. ఈ సినిమాకు ఈ బ్యూటీ భారీ మొత్తంలో పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది వరకు ఒక్కో సినిమాకు ఈ ముద్దుగుమ్మ 3 కోట్ల నుండి 3.5 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకోగా , సూర్య మూవీ కోసం ఏకంగా 4 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అవకాశాలు తగ్గినా కూడా ఈ ముద్దుగుమ్మకు భారీ రెమ్యూనిరేషన్ తో సినిమాలు మాత్రం దక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధించినట్లు అయితే మళ్లీ ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం పెరిగే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: