పుష్ప 2: అసలేందుకు వాయిదా పడిందంటే?

Purushottham Vinay
అల్లు అర్జున్ నుంచి రాబోయే పుష్ప ది రూల్ ఇంకా షూటింగ్ స్టేజ్ లో ఉంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని సుకుమార్ సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కిస్తున్నాడు.పుష్ప మూవీకి సీక్వెల్ గా సిద్ధమవుతోన్న చిత్రం కావడంతో దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కచ్చితంగా పుష్ప ది రూల్ మూవీతో 1000 కోట్ల కలెక్షన్ మార్క్ ని అందుకోవాలని మైత్రీ మూవీ మేకర్స్ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ ఇంకా షూటింగ్ దశలో ఉంది.  సుకుమార్ పుష్ప ది రూల్ చిత్రాన్ని చాలా ప్లాన్డ్ గా చేస్తున్నారు. కచ్చితంగా ఇండస్ట్రీ హిట్ కొట్టాలనే కసితో అవుట్ ఫుట్ రెడీ చేసే పనిలో ఉన్నారు. ఆగష్టు 15న ఈ సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ఆ డేట్ కి రిలీజ్ సాధ్యం కాకపోవచ్చనే మాట బలంగా వినిపిస్తోంది. దీనికి కారణం పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ సినిమా రిలీజ్ ఆగష్టు 15న ఎనౌన్స్ చేయడమే. అయితే మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం రిలీజ్ డేట్ వాయిదాపై మాత్రం ఇంకా ఎలాంటి అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు. దీనికి కారణం సుకుమార్ నుంచి స్పష్టత రాకపోవడమే అని సమాచారం తెలుస్తోంది.


ఎట్టి పరిస్థితిలో 40 రోజుల్లో పూర్తిగా మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలని సుకుమార్ టార్గెట్ గా పెట్టుకున్నారట. దీని కోసం ఏకంగా మొత్తం మూడు యూనిట్స్ వర్క్ చేస్తున్నాయట. మారేడుమల్లిలో కొన్ని కీలక సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నారని సమాచారం తెలుస్తుంది. ఈ సినిమా బాగా రావడానికి టీమ్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో హార్డ్ వర్క్ చేస్తున్నారంట. విశ్రాంతి అనేదే తీసుకోకుండా షూటింగ్ కంప్లీట్ చేయడంపైన దృష్టి పెట్టారంట. అనుకున్న టైం లోపు ఈ సినిమా కంప్లీట్ అయితే ముందు ఫిక్స్ చేసినట్లుగానే ఆగష్టు 15 వ తేదీకి రిలీజ్ చేసే అవకాశం ఉందనే మాట బలంగా వినిపిస్తోంది. ఒక వేళ షూటింగ్ కనుక ఆలస్యం అయితే క్రిస్మస్ కి పుష్ప ది రూల్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట మూవీ టీం.ఎంత విశ్రాంతి లేకుండా పని షూటింగ్ చేసిన కూడా పోస్ట్ ప్రొడక్షన్ లో కూడా సుకుమార్ స్పెషల్ ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సినిమా క్వాలిటీ అవుట్ ఫుట్ అనుకున్నట్లు రావడానికి మరికొంత సమయం తీసుకున్న ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. పుష్ప మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ రిలీజ్ ముందు రోజు దాకా జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: