SSMB29లో మహేష్ తనయుడు?

Purushottham Vinay
ఫ్యాన్స్ కి పండగే!టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు వారుసుడు గౌతమ్ కృష్ణ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నమ్రత లేటెస్ట్ పోస్ట్‌తో డెబ్యూ గౌతమ్ విషయంలో క్లారిటీ ఇచ్చేశారా?. మహేష్ బాబు నెక్ట్స్ మూవీతోనే గౌతమ్‌ సిల్వర్‌ స్క్రీన్ జర్నీని స్టార్ట్ చేయబోతున్నారా..? అనేది ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌ అవుతుంది. సూపర్ స్టార్ మహేష్‌ బాబు వారుసుడు గౌతమ్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ గురించి చాలా రోజుల నుంచి నెట్టింటా చర్చ జరుగుతోంది. గతంలో మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన వన్ నేనొక్కడినే సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసినా..అప్పట్లో అతని ఫిలిం జర్నీ గురించి క్లారిటీ ఇవ్వలేదు సూపర్ స్టార్ ఫ్యామిలీ.ఏదో సరదాగా ఆ క్యారెక్టర్ ని చేశాడు.. మూవీల్లోకి ఎంట్రీ ఇస్తాడో లేదో ఇప్పుడే చెప్పలేం అంటూ మాట దాటవేశారు. కానీ ఈ మధ్య స్టేజ్‌ షోస్‌లో నటించి తనకు యాక్టింగ్ ఇంట్రస్ట్ ఉందన్న హింట్ కూడా ఇచ్చారు సూపర్ స్టార్ తనయుడు గౌతమ్‌.


తాజాగా గౌతమ్‌ మేకోవర్ అవుతున్న వీడియోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు మహేష్ భార్య నమ్రత. ఈ వీడియోలో తండ్రి సూపర్ స్టార్ మహేష్‌ బాబు లాగే జిమ్‌లో బాగా కండలు పెంచుతూ కనిపించారు గౌతమ్‌.ఆల్రెడీ హీరో లుక్స్‌లొ కనిపిస్తున్న గౌతమ్‌ను చూస్తే త్వరలోనే సిల్వర్‌ స్క్రీన్ ఎంట్రీ అనేది ఉండబోతుందా అన్న డౌట్స్ కూడా పుట్టుకు వస్తున్నాయి. ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం మేకోవర్ అవుతున్నారు సూపర్ స్టార్ మహేష్‌. ఈ సినిమాలో బల్కీ బాడీతో డిఫరెంట్‌గా కనిపించేందుకు మహేష్ బాబు తెగ కష్టపడుతున్నారు.ఇక ఇప్పుడు తనయుడు గౌతమ్‌ కూడా అదే లుక్‌లోకి మారిపోవటంతో మహేష్ - రాజమౌళి మూవీలో గౌతమ్‌ కూడా నటిస్తున్నారా? అన్న చర్చ నెట్టింటా మొదలైంది. ప్రజెంట్ టాలీవుడ్‌లో స్టార్‌ వారసుల ఎంట్రీ గురించి గట్టి చర్చే నడుస్తుంది.రీసెంట్ టైమ్స్‌లో వరుసగా పబ్లిక్ అపియరెన్స్‌ ఇస్తున్న పవన్‌ కళ్యాణ్ కొడుకు అకీరా, ఎప్పటి నుంచో డెబ్యూ విషయంలో ఊరిస్తున్న బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం వారి ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ టైమ్‌లో గౌతమ్ ఎంట్రీ టాక్ రావటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: