నాని : సరిపోదా శనివారం ఫస్ట్ సింగిల్ వచ్చేసింది..

murali krishna
న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నాని వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. నాని గత ఏడాది “హాయ్ నాన్న ” సినిమా తో ప్రేక్షకులను పలకరించాడు..నూతన దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది .ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా లో నాని ,మృణాల్ ఠాకూర్ అద్భుతంగా నటించి మెప్పించారు.ఇదిలా ఉంటే నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ “సరిపోదా శనివారం”..ఈ సినిమాను వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్నాడు.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో అంటే సుందరానికి ! సినిమా తెరకెక్కింది..ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.ఈ సినిమా లో నాని సరసన నజ్రియా హీరోయిన్ గా నటించింది.

అంటే సుందరానికి సినిమా కమర్షియల్ హిట్ కాకపోవడం తో ఈ సారి వీరిద్దరూ యాక్షన్ డ్రామా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ఈ సినిమా లో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుళ్‌ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య,కళ్యాణ్ దాసరి లు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమా పై అంచనాలను పెంచేసింది. ఈ మూవీని ఆగస్టు 29 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యం లో చిత్ర బృందం ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. అందులో భాగంగా తాజాగా ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేసింది. 'గరం గరం యముడయో’ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఈ పాట విశాల్ దద్లానీ పాడగా జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించారు.ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: