Vijay sethupathi: అందువల్ల చాలా బాధ వస్తుంది.. విజయ్ సేతుపతి ఎమోషనల్ కామెంట్స్..!

lakhmi saranya
Vijay sethupathi:  విజయ్ సేతుపతి.. పరిచయం అవసరం లేని పేరు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్న ఈ నటుడు తాజాగా నటించిన చిత్రం మహారాజు. ఈ మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. విలన్ సామినాథన్  డైరెక్షన్లో ప్యాషన్  స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్ పై సుధన్  సుందరం, జగదీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక విజయ్ సేతుపతి కి ఇది 50వ చిత్రం కావడంతో మెమొరబుల్ హిట్ అందించడం కోసం దర్శకుడు చాలా కసరత్తులు చేశాడు. నిర్మాతలు ఈ ప్రాజెక్టుని హ్యుజ్ బడ్జెట్ తో లావిష్ గా నిర్మించారు.
ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ అండ్ ట్రైలర్ ఈ మూవీ పై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ఈ చిత్రం ఏపీ అండ్ తెలంగాణలో రిలీజ్ చేయనున్నారు. విజయ్ సేతుపతి మహారాజ మూవీ జూన్ 14న థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు విజయ్ సేతుపతి. ఇదే క్రమంలో తాజాగా హీరో విజయ్ సేతుపతి విలేకరుల సమావేశంలో మూవీ విషయాలని పంచుకున్నారు. " ఇది చాలా అద్భుతమైన జర్నీ. 50 సినిమాలు చేశాను. ఈ జర్నీలో దాదాపు 500 కు పైగా కథలు విన్నాం.
ఎంతోమందిని కలిసాను. హిట్స్ అండ్ ఫ్లాప్స్ చూశాను. రిజల్ట్ ఏదైనా అది గొప్ప అనుభవాన్ని ఇచ్చింది. ఇక ఇది చాలా వండర్ఫుల్ జర్నీ. ఇప్పటివరకు చాలా రకాల సినిమాలు అండ్ క్యారెక్టర్స్ చేశాను. మహారాజా లో చేసిన క్యారెక్టర్ నా గత చిత్రాలకి డిఫరెంట్ గా ఉంటుంది. నా క్యారెక్టర్ ఇంట్రో వర్ట్ గా ఉంటుంది. అదే సమయంలో యాంగ్రీ మ్యాన్ లాగా ఉంటుంది. నేను ఏది క్యారీ చేయను. నాచురల్ గా ఉంటాను. ఏదైనా మనసులో పెట్టుకుంటే దానిపైన ఎక్కువ వస్తుంది. తరువాత దానిని నేను ఎక్స్ప్రెస్ చేయలేను. అందువల్ల చాలా బాధ వస్తుంది " అంటూ తెలియజేశారు విజయ్ సేతుపతి. ప్రజెంట్ విజయసేతుపతి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరడ్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: