పవన్ కోసం వెయిట్ చేస్తున్న దర్శకులు..?

MADDIBOINA AJAY KUMAR
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితం హరిహర వీరమల్లు అనే సినిమాను స్టార్ట్ చేశాడు. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అనేక సార్లు ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. మొదట ఈ మూవీ యొక్క దర్శకత్వ బాధ్యతలను క్రిష్ తీసుకున్నాడు. అందులో భాగంగా కొంత భాగం షూటింగ్ ను కూడా ఈయన పూర్తి చేశాడు. కానీ ఈ సినిమా ఎప్పుడు వాయిదా పడుతూ ఉండడంతో ఈయన ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. దానితో సినిమా దర్శకత్వ బాధ్యతలను రూల్స్ రంజన్ మూవీ దర్శకుడు అయినటువంటి జ్యోతి కృష్ణ తీసుకున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ ని కూడా ప్రారంభించాడు. ఈ సినిమా యొక్క షూటింగ్ కొంత భాగం పూర్తి అయిన తర్వాత పవన్ రాజకీయ పనులతో ఫుల్ బిజీ అయ్యారు. అలాగే ఈ మూవీ తో పాటు పవన్ "ఓజి" అనే మూవీ ని కూడా స్టార్ట్ చేసి కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత రాజకీయాలపై దృష్టి పెట్టడం తో ఈ మూవీ కూడా ఆగిపోయింది. ఈ మూడు మూవీ లను స్టార్ట్ చేసి కొంత బాగం షూటింగ్ లు పూర్తి చేసుకున్న తర్వాత పవన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు రావడంతో వాటిపై ఫోకస్ పెట్టాడు. 

దానితో ఈ మూడు మూవీ ల షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. కొన్ని రోజుల క్రితమే ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ అయ్యాయి  వాటి ఫలితాలు వచ్చాయి. వీటిలో పవన్ కళ్యాణ్ గెలవడం మాత్రమే కాకుండా తన పార్టీ నుండి పోటీ చేసిన సభ్యులంతా గెలుపొందారు. ఇక మరికొన్ని రోజుల్లోనే పవన్ రాజకీయ పనులన్నింటిని చక్కబెట్టి ఈ మూడు మూవీ లకు పెద్ద మొత్తంలో డేట్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దానితో పవన్ ఎప్పుడు సినిమాలకు తేదీలు ఇస్తాడా.. వాటిని ఎప్పుడు పూర్తి చేసుకుందామా అని ఈ మూడు సినిమాలకు సంబంధించిన దర్శకులు పవన్ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: