"ప్రేమ కథ చిత్రం" రీ రిలీస్ తేదీ వచ్చేసింది..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటలలో ఒకరు అయినటువంటి సుధీర్ బాబు కెరియర్ లో అద్భుతమైన విజయం సాధించిన సినిమాలలో ప్రేమ కథ చిత్రం ఒకటి. ఈ మూవీ తర్వాత ఈయన ఎన్నో సినిమాలలో నటించిన ఏ చిత్రం కూడా ఈ స్థాయి విజయాన్ని ఇప్పటి వరకు సుధీర్ బాబు కెరియర్ లో అందుకోలేదు. ఈ మూవీ లో నందిత హీరోయిన్ గా నటించగా ... ప్రభాకర్ రెడ్డి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.
 

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మారుతి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. హర్రర్ , కామెడీ జోనర్ లో రూపొందిన ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకోవడం మాత్రమే కాకుండా సూపర్ సాలిడ్ కలెక్షన్లను రాబట్టింది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించి మంచి కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమాను తిరిగి థియేటర్లలో రీ రిలీస్ చేయబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలను కొన్ని రోజుల క్రితమే మేకర్స్ విడుదల చేశారు. 

ఇక తాజాగా ఈ మూవీ ని ఏ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నారు అనే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ ని జూన్ 21 వ తేదీన థియేటర్లలో మళ్ళీ రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. మరి ప్రస్తుతం తెలుగు లో రీ రిలీజ్ లా ట్రెండ్ గొరుగా కొనసాగుతుంది. మరి ప్రేమ కథ చిత్రం రీ రిలీస్ లో భాగంగా ఎలాంటి ఇంపాక్ట్ ను చూపిస్తుందో తెలియాలి అంటే జూన్ 21 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఈ మూవీ లో సప్తగిరి ముఖ్యపాత్రలో నటించాడు. ఈయన ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

sb

సంబంధిత వార్తలు: