"వెట్టాయ‌న్" ఓటిటి పార్టనర్ లాక్..!

MADDIBOINA AJAY KUMAR
సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం వేట్టాయన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే . ఈ మూవీ కి జై భీమ్ ఫేమ్ టిజే జ్ఞానవెల్ దర్శకత్వం వహిస్తున్నాడు . ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది . మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ యొక్క మొత్తం షూటింగ్ పూర్తి కాబోతోంది . ఈ సినిమాను అక్టోబర్ 10 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను అమ్మి వేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ ఓ టీ టీ సంస్థలలో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఏకంగా 65 కోట్ల భారీ దరకు దక్కించుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో అవుతుంది.

ఇకపోతే ఈ సినిమా థియేటర్ లలో విడుదల అయ్యి కొన్ని వారాల రన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇలాపోతే సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా నటిస్తున్న మూవీ కావడం , జై భీమ్ లాంటి అద్భుతమైన సినిమా తర్వాత జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో వేట్టాయన్ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: