టార్గెట్ కి అటూ దగ్గరలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి... రిచ్ అయ్యేనా..!

MADDIBOINA AJAY KUMAR
విశ్వక్ సేన్ హీరో గా రూపొందిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మే 31 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే 10 రోజులు అవుతుంది. మరి పది రోజుల్లో ఈ సినిమాకు ఎన్ని కలెక్షన్లు వచ్చాయో తెలుసుకుందాం. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10 రోజుల్లో 8.92 కోట్ల షేర్ , 15.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 10 రోజుల్లో 10.74 కోట్ల షేర్ , 19.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక ఈ మూవీ కి దాదాపుగా 10.30 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. కాకపోతే ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజే నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమా కాస్త తక్కువ కలెక్షన్ రాబడుతూ వచ్చింది. అయినప్పటికీ ఈ సినిమా భారీ కలక్షలనే రాబట్టింది. ఇక ప్రస్తుతం ఉన్న ప్రస్తుతను బట్టి చూస్తే ఈ మూవీ మరో 26 లక్షల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా ఓ టి టి రిలీజ్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలుబడింది.

ఈ మూవీ జూన్ 14 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. దానితో ఈ సినిమా ఎలాగో మరో మూడు రోజుల్లో ఓ టీ టీ లోకి రాబోతుంది , కాబట్టి ఈ సినిమాకు థియేటర్ లలో కలెక్షన్ లు భారీగా అచ్చే అవకాశం లేదు. మరి దానితో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకుంటుందా ..? లేదా అనేది చూడాలి. ఈ మూవీ లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా , అంజలి ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs

సంబంధిత వార్తలు: