అశోక్ గల్లా "దేవకీ నందన వాసుదేవ" షూటింగ్ కంప్లీట్..!

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా కొంత కాలం క్రితం హీరో అనే మూవీ తో వెండితెరకు పరిచయం అయిన విషయం మన అందరికీ తెలిసిందే . మహేష్ మేనల్లుడు కావడం , ఈ సినిమా విడుదలకు ముందు మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు బాగుండడంతో ఈ సినిమా పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.
 

దానితో ఈ  సినిమా యావరేజ్ విజయాన్ని అందుకోగలిగింది. ఇకపోతే హీరో మూవీ తర్వాత ఈ నటుడు దేవకి నందన వాసుదేవా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. జాంబిరెడ్డి , హ‌నుమాన్ చిత్రాల ఫేమ్ ప్ర‌శాంత్ వర్మ  ఈ చిత్రానికి కథనందిస్తుండ‌గా ... గుణ 369 ఫేం అర్జున్‌ జంధ్యాల ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో అశోక్‌ గల్లా సరసన హీరోయిన్‌ గా మాజీ మిస్‌ ఇండియా మానస వారణాసి న‌టిస్తుంది. ఇప్ప‌టికే మూవీ నుంచి టీజ‌ర్‌ తో పాటు ఫ‌స్ట్ సింగిల్ భేకర్స్ విడుద‌ల చేయ‌గా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి వచ్చింది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. ఈ మూవీ మేకర్స్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మొత్తం షూటింగ్ పూర్తి అయినట్టు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో మరికొన్ని రోజుల్లోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టి ఆ తర్వాత ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ag

సంబంధిత వార్తలు: