వరుణ్ సందేశ్ "నింద" మూవీ నైజాం హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో వరుణ్ సందేశ్ ఒకరు. ఈయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన హ్యాపీ డేస్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మంచి విజయాన్ని , సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈయన నటించిన కొత్త బంగారు లోకం మూవీ కూడా సూపర్ సక్సెస్ కావడంతో ఈయన క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. ఆ తర్వాత ఈయనకు వరుస సినిమా అవకాశాలు రావడం మొదలు అయింది.
 

అందులో భాగంగా ఈయన అనేక సినిమాలలో హీరోగా నటించాడు. కాకపోతే ఇప్పటి వరకు ఈయనకు కొత్త బంగారు లోకం సినిమా తర్వాత సరైన విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. కొంత కాలం క్రితం ఈ నటుడు చిత్రం చూడరా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు నింద అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని జూన్ 21 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తున్నారు.

అందులో భాగంగా తాజాగా ఈ సినిమా యొక్క నైజాం ఏరియా థియేటర్ హక్కులను ఈ మూవీ బృందం వారు అమ్మి వేశారు. ఈ సినిమా నైజాం ఏరియా థియేటర్ హక్కులను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ ఎల్ పి సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ సంస్థ వారు అధికారికంగా ప్రకటించారు. ఇక మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నైజాం ఏరియాలో భారీ ఎత్తున విడుదల చేయడానికి ఏర్పాట్లను ఇప్పటి నుండే మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో వరుణ్ సందేశ్ కు ఏ స్థాయి విజయం అందుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: