చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చిరు..?

MADDIBOINA AJAY KUMAR
2024 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13 వ తేదీన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు జూన్ 4 వ తేదీన విడుదల అయ్యాయి. ఇకపోతే ఈ ఎన్నికలలో అప్పటి వరకు అధికార పార్టీగా ఉన్న వై సి పి ఒంటరిగా బరిలోకి దిగితే , తెలుగు దేశం , జనసేన , బి జె పి మూడు పార్టీలు కలిపి పొత్తులో భాగంగా బరిలోకి దిగాయి.

ఇక దీనితో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలె అవకాశం దాదాపుగా లేకపోవడంతో కూటమి కి భారీ ఎత్తున సీట్లు వస్తాయి అని మొదటి నుండే చాలా మంది అంచనా వేస్తూ వచ్చారు. రిజల్ట్ వారి అంచనాలకు మించి వచ్చింది. తెలుగు దేశం పార్టీ కే సొంతగా ప్రభుత్వాన్ని నెలకొల్పే స్థాయిలో అసెంబ్లీ స్థానాలు రాగా , జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేస్తే 21 అసెంబ్లీ స్థానాలలో గెలిచింది. అలాగే 2 పార్లమెంటు స్థానాలలో పోటీ చేస్తే రెండింటిలో కూడా గెలిచింది.

ఇక బి జె పి 10 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేస్తే 8 స్థానాలలో గెలిపింది. ఇకపోతే రేపు అనగా జూన్ 12 వ తేదీన టి డి పి పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు అమరావతి లో ప్రమాణ స్వీకారం చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకారానికి ఎంతో మంది గొప్ప వ్యక్తులు ముఖ్య అతిథులుగా రానున్నారు.

తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎన్నో సంవత్సరాలుగా కెరీర్ ను కొనసాగించి ప్రస్తుతం కూడా అద్భుతమైన జోష్ లో సినీ పరిశ్రమలో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న మెగాస్టార్ చిరంజీవి కూడా రేపు జరగబోయే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు నుండి చిరంజీవి కి ప్రత్యేక ఆహ్వానం కూడా అందినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: