కాజల్ " సత్యభామ " బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్.. ఫస్ట్ వీకెండ్ ఎంత రాబట్టిందంటే..?

lakhmi saranya
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటించిన లేటెస్ట్ ఫిలిం సత్యభామ. ఈ చిత్రం కథ శుక్రవారం అనగా జూన్ 7న రిలీజ్ అయింది. ఈ పోలీస్ డ్రామాకు మిక్స్డ్ రివ్యూలు దక్కాయి. ఇక ఆ ప్రభావం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పైన పడినట్లు కనిపిస్తుంది. ఈ సినిమాకు చాలా రోజులుగా బాగానే ప్రమోషన్లు నిర్వహించినప్పటికీ ఫస్ట్ వీకెండ్ మాత్రం ఆశించిన మేర కలెక్షన్స్ రాబట్ట లేకపోయింది. కాజల్ నటించిన సత్యభామ మూవీ ఫస్ట్ వీకెండ్ ఇండియాలో 1.3 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
తొలి రోజు 0.4 కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం తరువాతే రెండు రోజుల్లోనూ పెద్దగా రావట లేకపోయింది. శనివారం 0.46 కోట్లు రాబట్టగా ఆదివారం 0.49 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. దీంతో తొలి మూడు రోజులు కలిపి 1.3 కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. నిజానికి సత్యభామ మూవీ ని కాజల్ తో పాటు టీం అంతా పెద్ద ఎత్తున ప్రమోట్ చేసింది. బాలకృష్ణ కూడా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చారు. తొలిసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కాజల్ అగర్వాల్ నటించింది. అయితే రిలీజ్ తర్వాత మాత్రం ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
సుమన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక సుమన్ కి ఇదే మొదటి సినిమా. వీకెండ్ లోనే మూవీకి ఆశించిన మేరా కలెక్షన్స్ రాలేదు. ఇక సోమవారం అనగా జూన్ 10 నుంచి ఈ కలెక్షన్లు మరింత పడిపోనున్నాయి. కాజల్తో పాటు ఈ సినిమాలో నవీన్ చంద్ర కూడా కీలక పాత్ర పోషించాడు. చాలా రోజుల గ్యాప్ తర్వాత నవీన్ చంద్ర చేసిన సినిమా ఇది.  కానీ ఇది ఆశించిన ఫలితం దక్కించుకోకపోవడంతో నిరాశపడ్డారు. ఇక ఇటు కాజల్ కి సైతం ఇదే మొట్టమొదటి లేడీ ఓరియంటెడ్ మూవీ. మొట్టమొదటి లేడీ ఓరియంటెడ్ మూవీ తోనే ఫ్లాప్ అందుకోవడంతో కాజల్ కూడా నిరాశకు గురయింది. మరి తన తదుపరి చిత్రాన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: