అదంతా ఫేక్ న్యూస్.. నమ్మకండి : లారెన్స్

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్లుగా కొనసాగుతున్న వారికి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  ఆయా సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఇంటర్నెట్ లోకి హీరో హీరోయిన్ల గురించి వచ్చే వార్తల్లో ఎన్ని నిజాలు ఉంటాయో ఎన్ని అబద్ధాలు ఉంటాయో చెప్పడం కూడా చాలా కష్టమే.

 ఈ హీరోయిన్ ఆ హీరో సినిమాలో నటిస్తుంది. ఆ హీరో ఆ దర్శకుడితో పని చేస్తున్నాడు  ఇలా ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తూ ఉంటాయి. అయితే ఇలా వచ్చిన కొన్ని ఊహాగానాలు నిజమవుతే మరికొన్ని మాత్రం కేవలం పుకార్లుగానే మిగిలిపోతూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న స్టార్ హీరోయిన్ మృనాల్ ఠాగూర్ గురించి ఒక వార్త ఇలాగే వైరల్ గా మారిపోయింది. స్వీట్ అండ్ క్యూట్ పాత్రలు చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న మృనాల్ ఠాకూర్ త్వరలోనే దెయ్యంగా అందరిని భయపెట్టబోతుంది అంటూ ఒక వార్త ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది.

 కాంచన సిరీస్ లో ఇప్పటికే మూడు సినిమాలు తీసి సూపర్ కిట్టు కొట్టిన రాఘవ లారెన్స్.. ఇక ఇప్పుడు కాంచన 4 తీయబోతున్నాడు. అయితే ఈ మూవీ లో మృనాల్ సెలెక్ట్ అయిందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై ఇటీవల దర్శకుడు,హీరో రాఘవ లారెన్స్ స్పందించాడు. కాంచన 4లో మృనాల్ ఠాగూర్ నటిస్తుంది అన్న వార్తలో నిజం లేదు అంటూ కొట్టి పారేసాడు. నటీనటులకు సంబంధించిన వివరాలను రాఘవ నిర్మాణ సంస్థతో త్వరలోనే అధికారికం గా వెల్లడిస్తుంది అంటూ పేర్కొన్నాడు. దీంతో దెయ్యం పాత్ర లో అటు మృనాల్ ఠాగూర్ ఎలా ఉండబోతుందో అని చూడాలనుకున్న అభిమానులకు నిరాశే ఎదురయింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: