అత్యంత భారీ లాభాలను అందుకున్న టాప్ 5 తెలుగు మూవీలు ఇవే..!

MADDIBOINA AJAY KUMAR
ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి థియేటర్లలో విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు మాత్రమే అద్భుతమైన లాభాలను అందుకున్నాయి. అందులో భాగంగా ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన సినిమాలలో భారీ లాభాలను అందుకున్న టాప్ 5 మూవీస్ ఏవో అనే విషయాన్ని తెలుసుకుందాం.
బాహుబలి 2 : ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 352 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ సినిమాకు 508 కోట్ల లాభాలు వచ్చాయి.
బాహుబలి 1 : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా ... అనుష్క , తమన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 118 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 186 కోట్ల లాభాలను అందుకుంది.
ఆర్ ఆర్ ఆర్ : రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 451 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీకి 163.03 కోట్ల లాభాలు వచ్చాయి.
హనుమాన్ : తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా  ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి 29.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 127.95 కోట్ల లాభాలు వచ్చాయి.
అలా వైకుంఠపురంలో : అల్లు అర్జున్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 84.34 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ కి 75.88 కోట్ల లాభాలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: