మహేష్.. ఎన్టీఆర్.. విజయ్ దేవరకొండ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన బాలీవుడ్ ఫోటోగ్రాఫర్..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ కూడా ఉంటారు . ఇప్పటికే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో హీరోగా నటించి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును దక్కించుకున్నాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు మరికొన్ని రోజుల్లోనే రాజమౌళి దర్శకత్వం లో రూపొందబోయే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించబోతున్నాడు . 

ఈ సినిమాతో ఈయనకు కూడా ఇండియా వ్యాప్తంగా రావడం ఖాయం  . ఇక ఇప్పటికే ఈయనకు హిందీలో కూడా మంచి మార్కెట్ ఉంది. విజయ్ దేవరకొండ ఇప్పటికే లైగర్ , ఖుషి అనే రెండు పాన్ ఇండియా సినిమాలలో హీరో గా నటించాడు . కానీ ఇవి విజయాలను అందుకోలేదు. అయినప్పటికీ ఈయనకు ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది . ఇలా ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా తమకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముగ్గురు వ్యక్తులపై బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ అయినటువంటి వీరేందర్ చావ్లా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.  ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఈయన మాట్లాడుతూ ... టాలీవుడ్ హీరోలు అయినటువంటి మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్ , విజయ్ దేవరకొండ చాలా నకిలీగా ఉంటారు అని ఆయన చెప్పారు. విజయ్ దేవరకొండ సింపుల్ గా ఉన్నట్లు చూపించుకోవడానికి మూవీ ప్రమోషన్స్ కి చెప్పులు వేసుకొని వచ్చారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ హోటల్లోకి వెళుతుండగా ఓ వ్యక్తి ఫోటో తీస్తే పక్కనున్న మరో వ్యక్తిని ఆయన తిట్టారు. మహేష్ బాబును బాలీవుడ్ భరించలేదు అని ఈయన అన్నారు. ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: