అఫీషియల్ : "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" ఓటిటి విడుదల తేదీ వచ్చేసింది.. ఎప్పుడు.. ఎక్కడో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి విశ్వక్ సేన్ తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. మే 31 వ తేదీన థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజే కాస్త నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. అయినప్పటికీ ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబడుతుంది.
 

ఇక ఓ వైపు ఈ సినిమా విజయవంతంగా థియేటర్లలో కొనసాగుతున్న సమయం లోనే ఈ మూవీ ఓ టి టి విడుదలకు సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను జూన్ 14 వ తేదీన తెలుగు తో పాటు తమిళ , మలయాళ , కన్నడ భాషలలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా నెల రోజులు కూడా తిరగకుండానే ఓ టీ టీ లోకి రాబోతుంది  మరి ఈ సినిమా ఓ టి టి ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని నేహా శెట్టి హీరోయిన్గా నటించగా , అంజలి ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs

సంబంధిత వార్తలు: