లాంగ్ కెరియర్ తో దోసుకుపోతున్న హీరోయిన్లు వీరే..!

MADDIBOINA AJAY KUMAR
ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దు గుమ్మలు తెలుగు సునీల్ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే చాలా సంవత్సరాలు కెరియర్ ను కొనసాగిస్తున్నారు. ఇక మిగతా వారంతా కూడా వచ్చామా .. వెళ్ళామా అన్నట్టు ఒకటి , రెండు సినిమాల్లో కనిపిస్తున్నారు. ప్రేక్షకులను కవ్విస్తున్నారు. ఆ తర్వాత కనుమరుగైపోతున్నారు. ఇక ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాలు కెరియర్ ను కొనసాగించి , ప్రస్తుతం కూడా ఇండస్ట్రీ లో తమ హవాను కొనసాగిస్తున్న కొంత మంది ముద్దుగుమ్మల గురించి తెలుసుకుందాం.

ఎప్పుడో విడుదల అయిన సూపర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనుష్క ఆ తర్వాత చాలా తక్కువ కాలం లోనే తెలుగు లో స్టార్ హీరోయిన్ స్థానానికి వెళ్ళింది. ఇప్పటికి కూడా ఈ బ్యూటీ అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇక ఈ లిస్టు లో మరో బ్యూటీ మిల్కీ బ్యూటీ తమన్నా ఈ ముద్దు గుమ్మ హ్యాపీ డేస్ మూవీ తో ఫుల్ క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది.

అంతకన్నా ముందే ఈ బ్యూటీ తెలుగు లో సినిమాలు చేసింది. ప్రస్తుతం కూడా తమన్నా వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇక సమంత చాలా సంవత్సరాల క్రితం విడుదల అయిన ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ తర్వాత చాలా తక్కువ కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ఈ నటి ఇప్పటికి కూడా సూపర్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటుంది. ఈ ముగ్గురితో పాటు మరి కొంత మంది కూడా పర్వాలేదు అనే స్థాయిలో కెరియర్ ను ముందుకు సాగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: