బాద్ షా బ్లాక్ బస్టర్ కాకపోవడానికి అదే కారణమా..?

MADDIBOINA AJAY KUMAR
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా శ్రీను వైట్ల దర్శకత్వంలో బాద్షా అనే మూవీ కొన్ని సంవత్సరాల క్రితం రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని మాత్రమే అందుకుంది. కాకపోతే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయం కావలసిన స్టామినా ఉంది.

మరి బ్లాక్ బాస్టర్ కావలసిన స్టామినా ఉండి కూడా ఈ మూవీ ఎందుకు ఆ స్థాయి విజయాన్ని అందుకోలేదు అని అంటే అందుకు చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి శ్రీను వైట్ల , ఎన్టీఆర్ హీరో గా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందించిన బాద్ షా మూవీ కంటే ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా సమంత హీరోయిన్ గా దూకుడు అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా ఇటు మహేష్ కు , అటు సమంత కు అలాగే శ్రీను వైట్ల కు అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఈ మూవీ తర్వాత శ్రీను వైట్ల "బాద్ షా" సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఇక ఈ మూవీ దాదాపుగా దూకుడు సినిమాకు దగ్గరగా ఉండడం , అలాగే ఈ సినిమాలో బ్రహ్మానందం కామెడీ బాగానే నవ్వించినప్పటికీ ఇది వరకే శ్రీను వైట్ల సినిమాల్లో బ్రహ్మానందం కామెడీ ఏ విధంగా ఉంటుందో ఈ మూవీ లో కూడా అదే విధంగా ఉండడంతో జనాలు కాస్త డిసప్పాయింట్ అయ్యారు. ఇలా దూకుడు సినిమాకు సంబంధించిన అనేక పాయింట్లు దీనికి టచ్ అవడం , అలాగే శ్రీను వైట్ల గత సినిమాకు సంబంధించిన కామెడీ సన్నివేశాలు సంబంధించిన సిచువేషన్ ఈ మూవీ లో ఉండడం , ఇలా ఇలాంటి కారణాల వల్ల ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే కాస్త యావరేజ్ మూవీ గా మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: