రాజమౌళి మూవీ కోసం కెరీర్లో ఎప్పుడు చేయని పని చేస్తున్న మహేష్..?

MADDIBOINA AJAY KUMAR
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే మహేష్ తన కెరీర్ లో మొదటి సారి దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శర వేగంగా జరుగుతున్నాయి.

మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యే లోపు తన బాడీ లుక్ కి సంబంధించి రాజమౌళి కొన్ని కండిషన్స్ పెట్టినట్లు , ప్రస్తుతం రాజమౌళి పెట్టిన కండిషన్స్ ప్రకారం మహేష్ తన బాడీలో మార్పులు , చేర్పులు చేసుకోవడానికి వర్కౌట్ లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక రాజమౌళి , మహేష్ కు ఈ సిన కోసం కచ్చితంగా బరువు పెరగాలి అని సూచించినట్లు తెలుస్తోంది.

దానితో మహేష్ , రాజమౌళి సినిమా కోసం బరువు పెరిగే పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నట్లు , కొంత మంది పర్యవేక్షణ ఆధ్వర్యంలో బరువు పెరగడానికి కావలసిన ఫుడ్ , వ్యాయామం డైలీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే మహేష్ ఇప్పటి వరకు తన కెరియర్ ను ప్రారంభించినప్పటి నుండి గెటప్ లను మార్చినప్పటికీ , హెయిర్ స్టైల్ మార్చినప్పటికీ బరువు విషయంలో మాత్రం ఎప్పుడు స్లిమ్ గానే కనిపిస్తూ వచ్చాడు. దానితో ఆయనకు ఎంత వయసు ఉన్నా కూడా చాలా చిన్న కుర్రాడిలా కనిపిస్తూ ఉంటాడు. కానీ రాజమౌళి మాత్రం మహేష్ నీ కాస్త బరువు పెరగమని చెప్పడంతో మహేష్ అభిమానులు ఆ లుక్ లో మహేష్ ఎలా ఉంటాడో అని ఆసక్తితో ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: