పూర్ణ తో అలాంటి సంబంధం... వార్తలపై స్పందించిన రవిబాబు..!

MADDIBOINA AJAY KUMAR
ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి , దర్శకత్వం వహించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో రవిబాబు ఒకరు . ఇక పోతే ఈయనపై అనేక రూమర్స్ వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే . అందులో ఒకటి ప్రముఖ నటి అయినటు వంటి పూర్ణ మరియు రవి బాబు ప్రేమించుకున్నారు అని ఒక వార్త చాలా వైరల్ అయిన విషయం మనకు తెలిసిందే . ఇకపోతే తాజాగా రవి బాబు ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు . అందులో భాగంగా పూర్ణ తో తనకు ఉన్న సంబంధం గురించి ఈయన క్లియర్ గా చెప్పుకొచ్చాడు . తాజా ఇంటర్వ్యూ లో భాగంగా రవి బాబు మాట్లాడు తూ ... నేను ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాను.

అందులో భాగంగా పూర్ణ నటించిన చాలా సినిమాలకు దర్శకత్వం వహించాను. ఇక నేను పూర్ణ తో వరుసగా సినిమాలు చేయడం వల్ల పూర్ణ నేను ప్రేమించుకుంటున్నాం అని వార్తలు వచ్చాయి. ఇక వాటిని చాలా మంది ప్రచురించడంతో అవి వైరల్ అయ్యాయి. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది , తప్ప ఎలాంటి తప్పుడు రిలేషన్ షిప్ లేదు. నేను మొదట కథ రాసుకొని అందులో ఏ నటి , ఏ నటుడు అయితే బాగుంటుందో వారిని తీసుకుంటాను. ఆ క్రమంలో నేను రాసిన కథల్లో ఆ పాత్రకి పూర్ణ ఫిట్ అవుతుంది అని నేను ఆమెను తీసుకున్నాను అంతే అని ఆయన చెప్పుకొచ్చాడు. ఇకపోతే రవి బాబు దర్శకత్వంలో రూపొందిన అవును , అవును 2 ,  లడ్డు బాబు , ఆవిరి నాలుగు సినిమాలలో పూర్ణ నటించింది. ఈ సినిమాలలో కొన్ని విజయాలను సాధిస్తే , మరికొన్ని అపజయాలను అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: