విజయ్ మూవీలో ఆ హీరోయిన్ ని ఓకే చేసే పనిలో దిల్ రాజు ఫుల్ బిజీ..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ "రాజా వారు రాణి గారు" మూవీతో దర్శకుడుగా గుర్తింపును సంపాదించుకున్న రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీని తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటువంటి దిల్ రాజు నిర్మించబోతున్నాడు.

వీరి కాంబోలో మూవీ మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇక ప్రస్తుతం విజయ్ , గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యే లోపు రవి కిరణ్ , విజయ్ తో చేయబోయే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో విజయ్ కి జోడిగా సాయి పల్లవి హీరోయిన్ గా ఓకే చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా మరికొన్ని రోజుల్లోనే ఈమెకు ఈ సినిమా కథను వినిపించనున్నట్లు , ఈ సినిమా కథ అందులోని పాత్ర తనకు నచ్చినట్లు అయితే సాయి పల్లవి ఈ మూవీ ఓకే చేసే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ ఈ సినిమాను సాయి పల్లవి ఓకే చేసినట్లు అయితే ఈ మూవీ పై మరింత జనాల్లో ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. మరి సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా ఒకే అవుతుందా ..? లేదా అనేది చూడాలి.  ప్రస్తుతం సాయి పల్లవి , నాగ చైతన్య హీరో గా చందు మండేటి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న తండల్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: