"దేవర" మూవీకి "ఎన్టీఆర్" రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా , సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి అనురుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తం ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది.

అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమా యొక్క మొదటి భాగం పనులు అక్టోబర్ కంటే చాలా ముందే పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో కూడా మూవీ మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ హీరోగా నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఈ సినిమా కోసం ఈ నటుడు భారీ మొత్తంలో పరిపోషకాన్ని తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది వరకు సినిమాకు 70 నుండి 80 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకున్న ఎన్టీఆర్ "దేవర" మూవీ కి 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక అదిరిపోయే రేంజ్ స్టామినా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కి ఈ మాత్రం రెమ్యూనిరేషన్ ఇవ్వడం పెద్ద విషయం ఏమీ కాదు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: