అతన్ని సౌందర్య ఘాఢంగా ప్రేమించింది... సీనియర్ నటి..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో చాలా సంవత్సరాలు తిరుగులేని హీరోయిన్ గా కెరియర్ ను ముందుకు సాగించిన ముద్దుగుమ్మలలో సౌందర్య ఒకరు. ఈమె తన కెరీర్ లో ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది. అందులో భాగంగా ఎన్నో విజయాలను అందుకొని చాలా సంవత్సరాలు తెలుగు లో తెలుగు రియల్ స్టార్ హీరోయిన్ గా కెరియర్ గా కొనసాగించింది. ఇకపోతే ఈమె తన కెరీర్ లో ఎక్కువ శాతం క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలోనే నటించి ఎక్కువ శాతం ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానాన్ని సంపాదించుకుంది.

చాలా వరకు గ్లామర్ షో కు దూరంగానే ఉంటూ వచ్చింది. అయినప్పటికీ ఈమెకు ఏ సమయంలో కూడా అవకాశాలు తగ్గలేదు. ఈమె క్లాస్ డీసెంట్ పాత్రలలో నటిస్తూ ఉన్నా కూడా ఆ సమయంలో రొమాంటిక్ పాత్రలలో నటిస్తూ స్కిన్ షో చేస్తున్న నటీమణుల కంటే ఎక్కువ అవకాశాలను దక్కించుకుంటూ జెట్ స్పీడ్ లో సౌందర్య ముందుకు దూసుకుపోయింది. ఇకపోతే తాజాగా సీనియర్ నటి నిర్మల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో నిర్మల ... సౌందర్య ఓ వ్యక్తిని ప్రేమించింది అని కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా నిర్మల మాట్లాడుతూ ... జయం మనదేరా సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు సౌందర్య నాకు చాలా క్లోజ్ అయింది. ఓ రోజు చాలా ఆనందంగా తనలో తానే పాటలు పాడుకుంటూ సౌందర్య నాకు కనిపించింది. దానితో ఏదో ఉంది , ఏ దొంగ చెప్పు అని నేను అడగ్గానే ఆమె సిగ్గుపడుతూ అసలు విషయం చెప్పింది. తను తన మేనమామను ప్రేమిస్తున్నాను అని ఆమె తెలిపింది. అంతేకాదు ఆమెకు చాలా డ్రీమ్స్ కూడా ఉండేవి. పిల్లలను పెంచడం అంటే సౌందర్య కు చాలా ఇష్టం అని , అలాగే తనకు లైఫ్ పై చాలా ఆశలు ఉన్నాయని కూడా ఆమె తెలిపింది. కానీ ఈ లోగానే ఘోరం జరిగి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది అని నిర్మల తాజా ఇంటర్వ్యూలో భాగంగా ఎమోషనల్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: