నేను చరణ్ ని కాదు.. అలా చేసినా నన్ను నమ్మరు.. కాజల్ కామెంట్స్..!

lakhmi saranya
20 ఏళ్లుగా సినీ కెరీర్ లో సత్తా చాటుతున్న ముద్దుగుమ్మలలో చందమామ గా పేరు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. ఎంతోమంది స్టార్ హీరోలతో జతకట్టి మంచి గుర్తింపును సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇక వివాహం అనంతరం మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ తో దూసుకుపోతుంది. తెలుగులో భగవంత్ కేసరి మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన కాజల్ మెయిన్ లీడర్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాగా వస్తున్న సత్యభామ.  
సుమన్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీను అవురమ‌ బ్యానర్ పై బాబీ తిక్క, శ్రీనివాసరావు నిర్మించారు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా జూన్ 7 అనగా నేడు థియేటర్లలో విడుదలైంది. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసింది టీం. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది కాజల్. " గతంలో జిల్లా సినిమాలో పోలీస్ గెటప్లో కనిపించ. అయితే అది సీరియస్ నెస్ ఉన్న రోల్ కాదు. సత్యభామ లో మాత్రం ఎమోషన్ అండ్ యాక్షన్ ఉన్న పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తా.
పోలీస్ రోల్స్ గతంలో ఎంతోమంది హీరోయిన్స్ చేసి ఉంటారు. కానీ ఇది నాకు కొత్త. నా తరహాలో పర్ఫార్మ్ చేశాను. మీకు నచ్చుతుందనే ఆశిస్తున్న. సత్యభామ లో యాక్షన్ సీక్వెన్సుల కోసం ఎంతో కష్టపడ్డా. ఆ ఫైట్స్ అన్ని రియలిస్టిక్ గా ఉన్నాయి. నేను రామ్ చరణ్లా 100 మందిని కొడితే ప్రేక్షకులు నమ్మరు. నా ఇమేజ్కు ప్రేక్షకులు ఇష్టపడేలా సెర్చ్ ఉన్నాయి. సుబ్బు యాక్షన్ సీక్వెన్స్లు కొరియోగ్రఫీ చేశారు " అంటూ చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్. ప్రజెంట్ ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాజల్ అగర్వాల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా జూన్ 7 అనగా నేడు థియేటర్లలో విడుదలైంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: