ఇండస్ట్రీకి రావాలి అనుకునేవారు ఆ నలుగురిని స్ఫూర్తిగా తీసుకోవాలి... డైరెక్టర్ వంశీ..!

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకుడిగా కెరీర్ ను ముందుకు సాగించిన వారిలో వంశీ ఒకరు. ఈయన చాలా తక్కువ బడ్జెట్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలను తెరకెక్కించాడు. దానితో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడుగా ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది. వగి దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు మ్యూజిక్ హిట్స్ గా నిలిచాయి. ఇకపోతే తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.

అందులో భాగంగా సినిమా బాగా రావాలి అంటే ఏం చేయాలి ..? సినిమా ఇండస్ట్రీ లో మంచి స్థాయికి ఎదగాలి అంటే ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి ఇలా అనేక విషయాల గురించి తాజా ఇంటర్వ్యూ లో భాగంగా ఆయన చెప్పుకొచ్చారు. తాజా ఇంటర్వ్యూ లో బాగంగా వంశీ మాట్లాడుతూ ...   సినిమా బాగా రావాలి అంటే ఏం చేయాలి అనే విషయాన్ని నన్ను చాలా మంది అడిగారు. నేను ఎంతో మంది గొప్ప దర్శకుల బుక్స్ చెబుతాను. వారంతా కూడా సినిమా బాగా రావాలి అంటే ముందు ఎలాంటి సమస్యలేని ఒక అద్భుతమైన కథను రెడీ చేసుకోవాలి.

అలాంటి కథను కనుక మనం ముందు రెడీ చేసుకోగలిగినట్లు అయితే అక్కడే సగం హిట్టు కొట్టినట్లు అవుతుంది. అందుకే నేను కొత్తగా ఇండస్ట్రీ లోకి వచ్చే దర్శకులకు అదే చెబుతాను. ముందు కథను పర్ఫెక్ట్ గా రెడీ చేసుకుని , ఆ తర్వాత సినిమా స్టార్ట్ చేసుకోవాలి అని. అలాగే ఇండస్ట్రీ కి రావాలి అనుకునే వారు ఓ నలుగురిని స్ఫూర్తిగా తీసుకోవాలి. బాపు గారు , బాలూగారు , చిరంజీవి గారు ,  ఇళయరాజా గారు వీరు నలుగురు కూడా నిద్రపోయేటప్పుడు తప్ప ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తూ ఉంటారు. అందుకే వారు సినిమా ఇండస్ట్రీ లో ఎంతో గొప్ప స్థాయికి వీరు ఎదిగారు అని తాజా ఇంటర్వ్యూ లో భాగంగా దర్శకుడు వంశీ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: