రాత్రికి అది లేకపోతే నేను ఉండలేను.. కనీసం రెండు రౌండ్లు వెయ్యాలి.. నాగార్జున..!

lakhmi saranya
కళ్ళల్లో చురుకుదనం.. మొఖంపై ముసి ముసి నవ్వులు.. చూడగానే ఆకట్టుకునే రూపంతో కలిగిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ మన మన్మధుడు అనే చెప్పుకోవచ్చు. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక తాజాగా నాగార్జున రాత్రికి మాత్రం అది లేకుండా అస్సలు ఉండలేనంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. రోజు రెండు రౌండ్లు వేస్తే గాని నిద్ర పట్టదట. పైగా తన ఫిట్నెస్ అసలు రహస్యం కూడా అదేనంటూ తెలిపాడు మన్మధుడు.
అక్కినేని నాగార్జున ఎంత ఫిట్గా ఉంటారో మనందరికీ తెలిసిందే. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగార్జున అంటేనే ఫిట్నెస్ కు క్యారాఫ్ అడ్రస్. ఎందుకంటే ఆరు పదుల వయసులోనూ చాలా యంగ్గా కనిపిస్తూ కుర్ర హీరోలకి మంచి పోటీ ఇస్తున్నాడు. ఇలా కనిపించడానికి అతను ఫుడ్ అండ్ డైట్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు కావచ్చు అని చాలామంది అనుకుంటారు. కానీ అసలు విషయం తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే బాడీ ఫిట్నెస్ కోసం నాగార్జున పెద్దగా కష్టపడడట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున తన ఫిట్నెస్ రహస్యాన్ని బయటపెట్టాడు. ఈ సందర్భంగా రాత్రికి అది లేకుండా ఉండలేను అంటూ రోజుకు రెండు రౌండ్లు వేయకుండా నిద్ర పట్టదు అంటూ తాను ఆల్కహాల్ తీసుకునే విషయంపై పరోక్షంగా సాఠరికల్ గా చెప్పుకొచ్చాడు.
నా సామి రంగ మూవీ ప్రమోషన్స్ సమయంలోను కీరవాణి మరియు చంద్రబోస్ లతో చిట్ చాట్ సందర్భంగా నాగార్జున ఈ విషయాలను పంచుకున్నాడు. ఫిట్నెస్ కోసం తాను పెద్దగా ఏమీ కష్టపడనని అందరిలాగానే రెండు మూడు రకాల కూరగాయలు మరియు నాన్వెజ్లు తింటానని తెలిపాడు. కాగా మధ్యాహ్నం ఎర్లీగా అంటే ఏడు గంటల లోపే తాను తినాల్సింది తినేస్తారట. ఆ సమయంలో వైట్ రైస్ కి బదులు బ్రౌన్ రైస్ తీసుకుంటానని తెలిపారు. దీంతోపాటు రెండు రౌండ్లు మందేస్తానని.. రాత్రికి ఖచ్చితంగా ఒక ముక్క స్వీట్ అయినా తింటానని వెల్లడించాడు నాగార్జున. ప్రజెంట్ నాగార్జున వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: