"మనమే" ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీ లో కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న సినిమాలలో నటిస్తూ నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న శర్వానంద్ ఆ తర్వాత సినిమాల్లో హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు. అలా హీరోగా కెరియర్ ను మొదలు పెట్టిన ఈయన కెరియర్ ప్రారంభించిన మొదట మంచి విజయాలను అందుకున్నాడు. దానితో ఈయన చాలా తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమంలో మంచి గుర్తింపు కలిగిన హీరోగా మారిపోయాడు.

ఇక ఆ తరువాత ఈయనకు వరుసగా అనేక అపజయాలు వచ్చాయి. ఇలా వరుస అపజయాలతో డీలా పడిపోయిన సమయం లోనే ఈయన కొంత కాలం క్రితం విడుదల అయిన ఒకే ఒక జీవితం మూవీ తో పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈ నటుడు మనమే అనే సినిమాలో హీరో గా నటించాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించగా ... కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. వాషిం అబ్దుల్ వహేబ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఈ మూవీ ని జూన్ 7 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా యొక్క ట్రైలర్ ను రామ్ చరణ్ చేతుల మీదగా విడుదల చేయించింది. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇక మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. దానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ముఖ్య అతిథిగా తీసుకురావడానికి శర్వానంద్ మరియు మూవీ యూనిట్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒక వేళ చరణ్ కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే  మనమే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆయన ముఖ్య అతిథిగా వచ్చే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: