"మనమే" లో మొత్తం ఎన్ని సాంగ్స్ ఉన్నయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో ఒకరు అయినటువంటి శర్వానంద్ తాజాగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన మనమే అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమాను ప్రముఖ నిర్మాత టీ జీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ ని జూన్ 7 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. ఇకపోతే కొన్ని గంటల క్రితమే ఈ మూవీ ట్రైలర్ ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ అధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

ఇకపోతే ఈ మూవీ కి ఖుషి , హాయ్ నాన్న లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలకు సంగీతం అందించిన వశిం  అబ్దుల్ వహెబ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ నుండి ఇప్పటికే కొన్ని సాంగ్స్ ను మేకర్స్ విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

ఇకపోతే తాజాగా ఈ సినిమా యొక్క ఆల్బమ్ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో మొత్తం 16 పాటలు ఉండబోతున్నట్లు , ఇందులో కొన్ని పెద్ద పాటలు ఉండబోతున్నట్లు , అలాగే కొన్ని సుచివేషన్ కు సంబంధించిన చిన్న చిన్న పాటలు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఏదేమైనప్పటికీ ఈ మూవీ లో మొత్తం 16 పాటలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో 16 పాటలు ఉండనున్నట్లు వార్తలు బయటకు రావడంతో ఈ మూవీ లోని సగం పాటలు అద్భుతంగా ఉన్న ఈ మూవీ ఈజీగా విజయం సాధిస్తుంది అని జనాలు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: