నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా స్వయంభు నుండి స్పెషల్ అప్డేట్..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో నిఖిల్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పాటు చేసుకున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం నిఖిల్ "కార్తికేయ 2" సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈయనకు ఇండియా వ్యాప్తంగా సూపర్ గుర్తింపు లభించింది. ఆ తర్వాత నిఖిల్ "స్పై" అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.
 

కార్తికేయ 2 మూవీ తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహ పరిచింది. ఇకపోతే ప్రస్తుతం నిఖిల్ "స్వయంభు" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాకి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... సంయుక్త మీనన్ , నబా నటేష్ ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు.

ఇకపోతే ఈ రోజు నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా స్వయంభు మూవీ యూనిట్ ఈ సినిమా నుండి నిఖిల్ కు సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో నిఖిల్ అదిరిపోయే పవర్ ఫుల్ లుక్ లో కత్తి యుద్ధాలు చేస్తూ ఉన్న పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయమన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: