"భజే భాయు వేగం" ఫ్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇవే... అంత రాబడితేనే హిట్ అవుతుంది..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ యువ నటుడు కార్తికేయ పోయిన సంవత్సరం "బెదురులంక 2012" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ సినిమా కంటే ముందు వరస అపజాయలను ఎదుర్కొన్న కార్తికేయ ఈ సినిమా విజయంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. "బెదురులంక 2012" లాంటి మంచి విజయవంతమైన మూవీ తర్వాత ఈ నటుడు యు వి క్రియేషన్స్ బ్యానర్ లో భజే భాయు వేగం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఈ రోజు అనగా మే 31 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల కానుంది.

"బెదురులంక 2012" లాంటి విజయవంతమైన సినిమా తర్వాత కార్తికేయ నటించిన మూవీ కావడం , ఈ సినిమా ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా భారీ ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. మరి ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ బిజినెస్ జరిగింది. ఎన్ని కోట్ల కలెక్షన్ లని సాధిస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్మలను కంప్లీట్ చేసుకుంటుంది. అలాగే ఈ మూవీ మొత్తం ఎన్ని థియేటర్ లలో విడుదల కాబోతుంది అనే విషయాలను తెలుసుకుందాం.
ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 300 వరకు స్క్రీన్ లను , మిగతా ప్రాంతాల్లో 100 స్క్రీన్ లోను అనగా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 400 స్క్రీన్ లలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.4 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక మరో 60 లక్షలు ఇతర ప్రాంతాల్లో జరిగినట్లు , దానితో ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా 4 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇక ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 4.5 కోట్ల మేర షేర్ కలెక్షన్ లను రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: