పవన్ తో పోటీ పడడానికి రెడీ అయిన మలయాళ హీరో..?

MADDIBOINA AJAY KUMAR
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల క్రితమే సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే మూవీ ని మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">డి వి వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ మొదలు అయిన తర్వాత కొన్ని రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరిగింది.

కానీ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ ల హడా విడి మొదలు కావడంతో పవన్ కళ్యాణ్ వాటిపై దృష్టి పెట్టాడు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఎలక్షన్ లు పూర్తి అయ్యాయి. జూన్ 4 వ తేదీన రిజల్ట్ రాబోతుంది. ఆ రిజల్ట్ అనంతరం ఈ సినిమా షూటింగ్ మళ్లీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతున్న సమయంలో ఈ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే పవన్ "ఓజి" మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో ఆ దారి దాపుల్లో మరో సినిమా విడుదల లేకుండా చాలా మూవీ బృందాలు జాగ్రత్తలు తీసుకున్నాయి.

ఇకపోతే ఒక మలయాళ హీరో మాత్రం పవన్ కళ్యాణ్ ను ఢీ కొట్టడానికి రెడీ అయ్యారు. అతని మరేవరో కాదు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం ఈయన టాలీవుడ్ దర్శకుడు అయినటువంటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న లక్కీ భాస్కర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి పవన్ కళ్యాణ్ సినిమాతో దుల్కర్ పోటీ పడబోతున్నాడు. మరి పవన్ కళ్యాణ్ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడి లక్కీ భాస్కర్ మూవీ తో దుల్కర్ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: