పిల్లలకి ప్రత్యేకమైన పేర్లు నామకరణం చేసిన సీనియర్ ఎన్టీఆర్.. వెనుక ఉన్న రహస్యం ఇదే..!

lakhmi saranya
లెజెండ్రీ హీరో అండ్ పొలిటిషన్ ఎన్టీఆర్ జయంతి నేడు. 1923 మే 28న ఈయన జన్మించారు. వెండితెరపై తిరుగులేని రారాజుగా ఎదిగిన సీనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా కీర్తిని ఇనుమడింప చేశారు. ఇక అనంతరం రాజకీయాల్లోకి వచ్చి తనదైన ముద్రవేశారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారం చేపట్టారు. తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్రను వేసుకున్నారు. నందమూరి తారకరామారావు ప్రతి విషయంలోనూ తనదైన ముద్ర వేశారు.

ఇక ఎన్టీఆర్ సమాజంతో పాటు కుటుంబాన్ని కూడా ఎంతో ప్రేమించారు. నందమూరి తారక రామారావుకి 12 మంది సంతానం. వారికి మంచి చదువులు చెప్పించారు కూడా. కలలు నేర్పించారు. బాలయ్య, హరికృష్ణ నటులుగా రాణించారు. చిత్ర పరిశ్రమలో నిర్మాతలుగా ఒకరిద్దరూ సత్తా చాటారు. ఇక ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరి దేశ రాజకీయాల్లో తనదైన ముద్రవేసింది. కాగా ఎన్టీఆర్ పిల్లల పేర్లను చాలా ప్రత్యేకంగా పెట్టారట. అబ్బాయిల పేర్లు చివర కృష్ణ వచ్చేలాగా అమ్మాయిల పేర్లు చివరి ఈశ్వరి వచ్చేలాగా ఎన్టీఆర్ పేర్లు పెట్టారట. రామకృష్ణ, సీనియర్ జయకృష్ణ, సాయి కృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, జూనియర్ జై కృష్ణ.. ఇలా కృష్ణ వచ్చేలాగా తన కొడుకుల పేర్లను పెట్టారు ఎన్టీఆర్.

ఇక అమ్మాయిల పేర్లు విషయానికి వస్తే.. పరదేశ్వరి, లోకేశ్వరి, భువనేశ్వరి, ఉమామహేశ్వరి గా ఎన్టీఆర్ నిర్ణయించారు. ప్రతి పేరు చివర ఈశ్వరి వచ్చేలా ఆయన పేర్లు నిర్ణయించాడు. ఎన్టీఆర్ తన కూతుర్లు, కొడుకుల పేర్ల విషయంలో ఒక ప్రాస ఫాలో అయ్యారు. ఇక ఎన్టీఆర్ కి దైవభక్తి ఎక్కువ. అందుకే గాడ్ కృష్ణ పేరు కొడుకులకు పెట్టారు. అదేవిధంగా శివుడి మరొక పేరు ఈశ్వరుడు లోని ఈశ్వరి అమ్మాయిల పేర్లలో చివరిగా వచ్చేలాగా పెట్టారు. అలాగే భాషాభిమానం కలిగిన ఆయన పిల్లల పేర్లలో తెలుగుదనం ఉట్టిపడేలా నిర్ణయించారు. దైవభక్తి, భాషాభిమానం వెరసి ఎన్టీఆర్ తన పిల్లల పేర్లను ప్రత్యేకంగా పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: