సిద్ధార్థ్ " భారతీయుడు 2 " సెకండ్ సాంగ్ ముహూర్తం ఖరారు.. ఆడియో లాంచ్ డేట్ ఇదే..!
అదేవిధంగా ఈ సినిమా ఆడియో లాంచ్ ను జూన్ 1న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా భారతీయుడు 2 జూలై 12న ప్రపంచవ్యాప్తంగా తమిళ్ మరియు హిందీ, తెలుగు, మలయాళం లో విడుదల కానున్నట్లు సమాచారం. ఇటీవల చిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిద్ధార్థ్ ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. దీంతో తన అభిమానులు భారతీయుడు 2 అయినా హోప్స్ పెట్టుకున్నారు.
అదేవిధంగా పెళ్లి అనంతరం రకుల్ ప్రీత్ సింగ్ చేస్తున్న చిత్రం నే ఈ భారతీయుడు 2. పెళ్లి అనంతరం సినిమాలకి గ్యాప్ ఇచ్చి ఫ్యామిలీతో టైమ్స్ స్పెండ్ చేస్తున్నా ఈ బ్యూటీ భారతీయుడు 2 మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టనుంది. ఈ సినిమా కనుక థియేటర్ల వద్ద సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంటే ఇటు రకుల్ తో పాటు అటు సిద్ధార్థ్ కెరీర్ కూడా పూర్తిగా మారిపోతుందని చెప్పుకోవచ్చు. ఇక కమల్ హాసన్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాలో కదా ఎలా ఉన్నా తన నటనతో మైమరిపించే సత్తా కలిగిన వాడు. మరి ఈ మూవీతో ఎంతటి విజయాన్ని సాధించుకుంటాడో వేచి చూడాలి.