"శతమానం భవతి 2" లో హీరో అతనే... దిల్ రాజు..!

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ హీరోగా మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా సతీష్ వేగేష్ణ దర్శకత్వంలో శతమానం భవతి అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. 2017 వ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ సినిమా తెలుగు కుటుంబాలను అత్యంత ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా విడుదల అయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సీక్వెల్ గా శతమానం భవతి 2 అనే మూవీ ని తెరకెక్కించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ మూవీ కి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఈ మూవీ కి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు. ఇక తాజాగా దిల్ రాజు "శతమానం భవతి 2" సినిమాకు సంబంధించిన ఓ కీలక అప్డేట్ ను ఇచ్చారు. తాజాగా ఈయన ఒక చోట మాట్లాడుతూ ... శతమానం భవతి 2 సినిమాకు సంబంధించిన చాలా పనులు కంప్లీట్ అయ్యాయి.

ఈ సినిమాకు రైటర్ అయినటువంటి హరి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఆశిష్ హీరోగా నటించబోతున్నాడు అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఇక దీనితో శతమానం భవతి 2 సంబంధించిన పనులు ఫుల్ స్పీడ్ గా జరుగుతున్నట్లు తెలుస్తోంది. శతమానం భవతి సినిమా బ్లాక్ బాస్టర్ కావడంతో శతమానం భవతి 2 పై కూడా భారీ అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: