ఏకంగా అన్ని కోట్ల ఖరీదైన కారును కొనుగోలు చేసిన చైతూ..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి నాగచై తన్య కు కార్లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన దగ్గర ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. అయినప్పటికీ కొత్త రకం కార్ లను నాగ చైతన్య కొనుగోలు చేస్తూనే ఉన్నారు. గతంలో ఆయన దగ్గర ఉన్న కార్లతోనే ఎన్నో సార్లు చైతన్య వార్తలు నిలిచారు. ఈయన దగ్గర ప్రస్తుతానికే ఎన్నో అధునాతనమైన టెక్నాలజీతో ఉన్న లగ్జరీస్ కారు లు చాలానే ఉన్నాయి. ఇప్పటికే చాలా కార్లు ఉండగానే మరొక కార్ ను కూడా ఈయన కొనుగోలు చేశాడు. తాజాగా నాగ చైతన్య "పోర్షే 911 జీ టీ 3 ఆర్ ఎస్" అనే కారును కొనుగోలు చేశారు.

దాదాపుగా దీని ధర 3.5 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇక కారు పక్కన నిలబడి ఉన్న చైతన్య ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక నాగ చైతన్య దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన కార్లలో లంబోర్గిని , ఫెరారీ , ల్యాండ్ రోవర్ తదితర కంపెనీలకు సంబంధించిన కార్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటికే ఎన్నో ఖరీదైన కార్ లని కలిగి ఉన్న నాగ చైతన్య మరో ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. దీని ద్వారానే క్లియర్ గా అర్థం అవుతుంది నాగ చైతన్య కు కార్లు అంటే ఎంత ఇష్టం అనేది.

ఇకపోతే నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే ... ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండేల్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో సాయి పల్లవి హీరోయిన్ గా కనిపించబోతుంది. ఈ మూవీ తర్వాత విరూపాక్ష సినిమా దర్శకుడు అయినటువంటి కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని విషయాలు మరికొన్ని రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nc

సంబంధిత వార్తలు: