ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీకి ఊరమాస్ టైటిల్..!?

Anilkumar
తెలుగు ఇండస్ట్రీలో దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ అని చెప్పొచ్చు. ఇక ఇప్పటివరకు ఈయన దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. నిజానికి ఆయన కన్నడ డైరెక్టర్. కన్నడ నుండి టాలివుడ్ కి వచ్చి ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆయన చేసిన అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయి. అంతేకాదు ఆయన దర్శకత్వంలో వచ్చే సినిమాలు అన్నీ కూడా కాసుల వర్షాన్ని

 కురిపిస్తాయి. అందులో భాగంగానే ఇప్పుడు ప్రశాంత్ నీ మరొక స్టార్ హీరోతో సినిమా చేయడానికి చూస్తున్నట్లుగా సమాచారం. ఆ స్టార్ హీరో మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్. అటు డైరెక్టర్ ఇటు హీరో ఇద్దరికీ భారీ స్టార్డం ఉండడంతో వీళ్ళిద్దరి కాంబోలో సినిమా వస్తే అది కచ్చితంగా భారీ విజయాన్ని అందుకుంటుంది. అందుకే ఇప్పటినుండే ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ స్థాయిలో ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో రాబోయే సినిమాకి సంబంధించిన టైటిల్స్ కొన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున

 వినపడుతున్నాయి. అయితే డైరెక్టర్ కేవలం కథను మాత్రమే పవర్ఫుల్ గా రాయకుండా టైటిల్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.  ఎన్టీఆర్ తో సినిమా కోసం ఆయన 'రుద్ర' 'డ్రాగన్' వంటి టైటిల్స్ ను అనుకుంటున్నట్లుగా సమాచారం. కానీ ఇందులో ఏ టైటిల్ ఎన్టీఆర్ కోసం ఫిక్స్ చేస్తారు అన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. నిజానికి ఈ రెండు టైటిల్స్ కూడా ఎన్టీఆర్ సినిమా కథకి బాగా ఆప్ట్ అవ్వడం విశేషం. అందుకే ఈ రెండు టైటిల్స్ లో ఏ టైటిల్ అయితే సినిమాకి బాగుంటుంది అన్న కన్ఫ్యూషన్ లో ప్రశాంత్ నీల్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం  దేవర సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. త్వరలోనే ఈ సినిమా విడుదల కూడా కానుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: