ఎగ్జిట్ పోల్స్ : ఇండియా టుడే సర్వేలో సంచలనం.. అంతా అయిపోయింది.. కారు షెడ్డుకే?

praveen
కేవలం ఒక్క రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా నేడు విడుదల కాబోయే ఎగ్జిట్ పోల్స్ పై అందరికన్ను ఉంది అనే విషయం తెలిసిందే. ఎందుకంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. పలు విడతలుగా జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఇకనేడు విడుదలవుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేల ప్రకారం ఏ పార్టీకి మెజారిటీ దక్కబోతుంది అన్న విషయాన్ని తెలుసుకునేందుకు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 ఈ క్రమంలోనే మొన్నటి వరకు ఏ పార్టీ గెలుస్తుంది అనే విషయంపై ఒక అంచనా తో ఉన్న వారందరూ కూడా ఎగ్జిట్ పోల్స్ సర్వే రిపోర్టులు చూసి ఒక్కసారిగా అవాక్కవుతున్నారు అని చెప్పాలి.  కేవలం విశ్లేషకులు మాత్రమే కాదు ఆయా పార్టీలలోని కీలక నేతలందరికీ కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అటు పార్లమెంట్ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎంతో మంది కీలక నేతలు కారు దిగి కాంగ్రెస్కు చేరుకున్నారు.

 దీంతో కారు పార్టీలో గందరగోళం  పరిస్థితులు నెలకొన్నాయ్. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నేతలను కాపాడుకోవాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సాధించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలోనే కెసిఆర్ తన రాజకీయ అనుభవాన్ని మొత్తం ఉపయోగించి పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులను బరిలోకి దింపినప్పటికీ  కారు పార్టీ షెడ్డు కు వెళ్లక తప్పడం లేదు అని తెలుస్తుంది  ఎందుకంటే ఇటీవల ఎగ్జిట్ పోల్స్ లో భాగంగా ఇండియా టుడే సర్వే ప్రకారం తెలంగాణలో ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ ఫలితాలలో కమలం పార్టీ దే మెజారిటీ అనేది తెలుస్తుంది. ఎందుకంటే బిజెపి 8 నుంచి 9 సీట్లు గెలుచుకుంటుందని.. అధికార కాంగ్రెస్ పార్టీ ఏడు నుంచి ఎనిమిది సీట్లలో  విజయం సాధిస్తుందని.. ఎంఐఎం ఒకటి గెలుచుకుంటుందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ సర్వే రిపోర్ట్ చెబుతుంది. అయితే బిఆర్ఎస్ మాత్రం ఒక్క స్థానంలో కూడా విజయం సాధించదని..ఈ సర్వే రిపోర్ట్ చెబుతూ ఉంది. దీన్ని ఇప్పటికే ప్రతిపక్షంతో సరిపెట్టుకొని భారీ ఎదురు దెబ్బతిన్న కారు పార్టీ ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో షెడ్డుకు వెళ్లడం ఖాయమని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: