వైసీపీపై పగ.. టీడీపీకి ఘనవిజయం పక్కా అంటున్న కల్కి నిర్మాత?

Purushottham Vinay
దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల సమరం ముగిస్తున్న నేపథ్యంలో ఇండియావైడ్ ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యి సంచలనం సృష్టిస్తున్నాయి.అయితే గత రెండు వారాల క్రితం ముగిసిన ఎన్నికల తర్వాత రకరకాల సర్వేలు, ఎన్నికల పోలింగ్ సరళి ఇంకా అలాగే ఓటు హక్కు వినియోగించుకొన్న తీరుపై అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో తమదే గెలుపని పార్టీలు ధీమాతో ఉన్నాయి. ఈ క్రమంలో కల్కి 2898 ఏడిని నిర్మిస్తున్న ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నిర్మాత అశ్వినీదత్ వీడియోను రిలీజ్ చేసి చెప్పిన జోస్యం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది. పూర్తి వివరాల్లోకి వెళితే..తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత చలసాని అశ్వినీదత్ ఏపీ రాజకీయాలపై ఆసక్తికరమైన ప్రకటనని చేశారు. అయితే గతంలో అశ్వినీదత్  రాజకీయాల్లో ఉన్నారు. 


అయితే విజయవాడ లోక్‌సభకు పోటీ చేసి ఓటమి చెందిన తర్వాత పాలిటిక్స్ నుంచి ఆయన తప్పుకొన్నారు.అయితే అశ్వినీదత్ మాత్రం తనకు అత్యంత ఆప్తుడు, అభిమాన నటుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీతో మాత్రం తన అనుబంధాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. కానీ తన నైతిక మద్దతునే ఇస్తూ రాజకీయాలకు చాలా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.తాజాగా వీడియోను రిలీజ్ చేసి.. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో మొత్తం 160 సీట్లను తెలుగుదేశం పార్టీ తరఫున కచ్చితంగా చంద్రబాబు నాయుడు గెలుచుకొంటారు అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా తెగ వైరల్ అవుతున్నది.
ఇదిలా ఉండగా, తన సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భాన్ని పురస్కరించుకొని.. పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 AD అనే సినిమాను ఏకంగా 600 కోట్ల రూపాయలతో రూపొందించారు. రెబల్ స్టార్ ప్రభాస్, దీపిక పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటించిన ఈ మూవీ జూన్ 27వ తేదీన భారీగా రిలీజ్ కాబోతున్నది. వైసీపీ టికెట్ రేట్స్ పెంచలేదని పగతో అశ్వినిదత్ ఇలా టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాడంటూ వైసీపీ ఫ్యాన్స్ కోప్పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: