ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపెవరిది..? ప్రభుత్వం ఏర్పాటు చేసేది కూటమా..? లేకుంటే వైసీపీనా..? అనేదానిపై తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన, అత్యంత విశ్వసనీయత కలిగిన ఆరా మస్తాన్ తేల్చేశారు.ఈ పోల్స్‌లో ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించి వైసీపీ, తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది సర్వేల ఆధారంగా ఈ పోల్స్‌ను విడుదల చేశాయి.ఏపీ లో ఆరా మస్తాన్ సర్వే లో హోరాహోరీగా జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ముఖ్య నియోజకవర్గాల్లో గెలుపు ఓటముల పరిస్థితులు ఇలా వున్నాయి.ఆరా మస్తాన్ తన స్వస్థలం నుంచి ఈ సర్వే ను ప్రారంభించారు. తన సర్వే ప్రకటించిన తర్వాత ఎవరు ఎలాంటి అరాచకాలకు పాల్పడవద్దని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆరున్నర నుంచి ఏడు గంటల వరకు తను మీడియా ముందు సమావేశంలో ఉంటానని ప్రకటించారు. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంది కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రకటించారు. 6:35కు ఆరా మస్తాన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అలాగే దేశవ్యాప్తంగా జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికలు ఆంధ్ర తెలంగాణ ఎన్నికల ఫలితాలు అంచనాలను ఆరా సమస్త పోస్ట్ పోల్ సర్వే ద్వారా ఈరోజు మీ ముందు ఉంచబోతుంది అన్నట్టు ప్రకటించారు. ఈ ఆరా పోస్ట్ పోల్ 2024 నా స్వస్థలం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.అందుకుగాను అందరూ మీడియా ప్రతినిధులు ప్రోత్సహించినందుకు చాలా ధన్యవాదాలు తెలిపారు.బొత్స సత్యనారాయణ ,పినిపే విశ్వరూప్,దాడిశెట్టి రాజా,తానేటి వనిత,మేరుగ నాగార్జున స్వల్ప ఆధిక్యంగా కాకాణి గోవర్థన్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి,కె. అంజాద్ బాషా స్వల్ప ఆధిక్యం,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తాడని అన్నారు.చ్చితంగా వైసిపినే అధికారంలోకి వస్తుందని మరలా టిడిపి ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందని తన సర్వేలో తేలిందని అన్నారు.ఏపీలో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆరా మస్తాన్ సర్వే తెలిపింది. ఎగ్జిట్ పోల్స్‌లో వైయస్‌ఆర్‌సీపీ కి జైకొట్టింది.