ఆరా మస్తాన్ :104 స్థానాలలో వైసీపీ దే అఖండ విజయం..!

Divya
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన తర్వాత.. చాలామంది ఎవరు గెలుస్తారనే విషయం పైన ఆసక్తికరంగా ఉన్నారు. దీంతో ఎన్నో రకాల సర్వేలను ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాము.. ముఖ్యంగా అధినేతలు కూడా తమ తమ ధీమాతో ఉంటున్నారు. ఈ రోజున ఎగ్జిట్ పోల్స్ లో పలు రకాల సర్వేలు కూడా తెలియజేయడానికి మరికొన్ని నిమిషాలలో సిద్ధంగా ఉన్నాయి. అలాంటి వాటిలో ఆరా మస్తాన్ సర్వే కూడా ఒకటి.. ఇప్పటివరకు ఎన్నో సర్వేలు చేసినప్పటికీ ఈ సర్వే మీద చాలామంది బెట్టింగులు కూడా కాస్తున్నారు. ఇప్పటివరకు విరు చెప్పిన సర్వే ఎక్కడ కూడా ఫెయిల్యూర్ అయినట్లుగా కనిపించలేదు.

అయితే తమలాంటి సంస్థల తెలివితేటలు నిరూపించుకోవడానికి ఇలాంటి సర్వే సంస్థలు తెలియచేస్తూ ఉంటామని  తెలియజేస్తున్నారు ఆరా మస్తాన్.. గత తెలంగాణలో జరిగిన ఎన్నికలలో కూడా ఆరా మస్తా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని విషయాన్ని క్లియర్ కట్గా తెలియజేసింది. దీంతో పాటు కర్ణాటక ఇతర ప్రాంతాలలో కూడా ఏ పార్టీ గెలుస్తుంది అనే విషయాన్ని తెలియజేశారు. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల జరిగిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఎగ్జిట్ పోల్స్ గురించి తెలియజేస్తున్నారు.

చిలకలూరిపేటలో ప్రెస్మీట్లో ఆరా మస్తాన్ మాట్లాడుతూ.. వాలంటరీ వ్యవస్థ, మహిళ పథకాలు, నవరత్నాలు పథకాలు హైలెట్ గా ఉంటాయని ఇవే కీలకంగా ఉంటాయని కూడా ఆరా మస్తాన్ తెలియజేస్తున్నారు.. ముఖ్యంగా గతంలో ఎన్నో ఇబ్బందులు పడిన ప్రజలు ఈసారి జగన్ ప్రభుత్వం వల్ల చాలా మారిపోయిందని ప్రజలు నమ్మారని తన అభిప్రాయంగా తెలియజేశారు.. వైసిపి పార్టీ ప్రజలలో ఆత్మ గౌరవాన్ని పెంచింది అనడానికి ఏమాత్రం తీసివేయకూడదు అన్నట్లుగా తెలియజేస్తున్నారు. అలాగే ఐదేళ్లలో ఫించన్  పెంచడం.. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు వైసిపి పార్టీ వైపే మొగ్గుచూపడం.. ప్రతి మూడు నెలలకు వైసిపి పార్టీ ఇస్తున్న డబ్బులు వల్ల,  గ్రామీణ ప్రజలలోని ఆర్థికంగా  పెరిగిందని.. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మహిళల్లో ఓవరాల్ గా మహిళలదే పై చేయి.. 56% మహిళలు వైసీపీ పార్టీకి ఓటు వేశారు.. 44 శాతం కూటమికి పడింది.. పురుషులలో వైసీపీ పార్టీ 45.35 శాతం అందుకుంది.. కూటమి 51.5 % అని తెలుపుతున్నారు.. అన్ని కులాలలో కూడా వైసీపీ పార్టీ గణనీయంగా ఓటింగ్ సంపాదించుకుంది.49.61 % తో 104 స్థానాలలో గెలవబోతోంది..తెలుగుదేశం 47.55 శాతం ఓటింగ్ తో  71-80 స్థానాలు గెలిచే అవకాశం ఉందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: