టిల్లు స్క్వేర్ టోటల్ కలెక్షన్స్ ఇవే... ఎన్ని కోట్ల లాభమో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ మంచి క్రేజ్ ను ఏర్పరచుకున్న యువ నటులలో ఒకరు అయినటువంటి సిద్దు జొన్నలగడ్డ కొంత కాలం క్రితం టిల్లు స్క్వేర్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఇక ఈ సినిమా యొక్క క్లోసింగ్ కలెక్షన్స్ వివరాలను తెలుసుకుందాం. అలాగే ఈ మూవీ కి ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయో చూద్దాం.

ఈ మూవీ కి నైజాం ఏరియాలో 26.55 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ ఏరియాలో 5.30 కోట్లు ... ఉత్తరాంధ్రలో 5.80 కోట్లు ... ఈస్ట్ లో 3.01 కోట్లు ... వెస్ట్ లో 1.90 కోట్లు , గుంటూరు లో 2.70 కోట్లు .... కృష్ణ లో 2.40 కోట్లు ... నెల్లూరు లో 1.54 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 49.20 కోట్ల షేర్ ... 89.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపు కొని 4.70 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... ఓవర్ సీస్ లో 15.10 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 69 కోట్ల షేర్ ... 130 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. 

ఈ మూవీ కి మొత్తం గా ప్రపంచ వ్యాప్తంగా 27 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 41 కోట్ల భారీ లాభాలను అందుకొని ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ మూవీ ల లిస్టు లో చేరిపోయింది. ఇక ఈ మూవీ కి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా ... అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sj

సంబంధిత వార్తలు: