సోషల్ మీడియా కి దూరంగా జబర్దస్త్ గెటప్ శ్రీను.. సడన్ గా ఎందుకు ఈ నిర్ణయం..!?

Anilkumar
జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు గెటప్ శ్రీను. జబర్దస్త్ లో మంచి కమెడియన్ గా కొన్ని సాగుతూనే సినిమాల్లో నటించే అవకాశాన్ని అందుకున్నాడు. ఎంతసేపైనా ఏకధాటిగా నవ్వించగల సత్తా అన్న గెటప్ శ్రీనుకి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించే అవకాశం దక్కింది. ఎందరో స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు గెటప్ శ్రీను. అయితే ప్రస్తుతం గెటప్ శ్రీను రాజు యాదవ్ అనే సినిమాతో హీరోగా పరిచయం అవ్వబోతున్నాడు. కాగా గెటప్ శ్రీను హీరోగా నటిస్తున్న ఈ సినిమా

 మే 17న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ పాటలు విడుదలై సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి. ఇకపోతే గెటప్ శ్రీను హీరోగా నటిస్తున్న రాజు యాదవ్ సినిమాలో శ్రీను క్రికెట్ ఆడేటప్పుడు తన ముఖానికి బాల్ తగిలి ఫేస్ ఎప్పుడు నవ్వుతూ ఉండే విధంగానే మారిపోతూ ఉంటుంది. ఇక అలాంటి ఒక సాధారణమైన వ్యక్తి జీవితంలో ఎటువంటి కష్టాలను ఎదుర్కొంటాడు అనే ఒక సరికొత్త అంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన

 ప్రమోషన్స్ లో భాగంగా బిజీగా ఉన్నాడు గెటప్ శ్రీను. అయితే ముఖ్యంగా చిన్నగా విడుదలయ్యే సినిమాలకి ప్రమోషన్స్ భారీ ఎత్తున చేయడం చాలా అవసరం. అందుకే గెటప్ శ్రీను సైతం ఇప్పుడు ప్రమోషన్స్ నిర్వహిస్తున్నాడు. ఇకపోతే., సినిమాని బాగా ప్రమోట్ చేయాల్సిన సమయంలో గెటప్ శ్రీను సంచలన నిర్ణయం తీసుకున్నాడు.  తాజాగా.. తాను కొద్ది రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటాననిమళ్ళీ కలుద్దాం అంటూ., గెటప్ శ్రీను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాను హీరోగా సినిమా విడుదలకు కేవలం 3 రోజులే ఉండగా.. ఇప్పుడు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు..? మరోవైపు తెలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు సోషల్ నెట్‌వర్క్‌లకు దూరంగా ఉంటాడడని కొందరు భావిస్తున్నారు. ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: