మహేష్, విజయ్, తారక్ లపై.. బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ విమర్శలు?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారికి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఇలా స్టార్ హీరోలకు సంబంధించి ఏదైనా విషయం సోషల్ మీడియాలోకి వచ్చిందంటే చాలు అది నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న మహేష్ బాబు, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ గురించి ఒక న్యూస్ వైరల్ గా మారిపోయింది.

 ఏకంగా ఒక బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ మహేష్ బాబు, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ లో తెరమీద నకిలీగా కనిపిస్తారని.. వారి నిజస్వరూపం మరొకటి ఉంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక అతను చేసిన కామెంట్స్ అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి అని చెప్పాలి. సాధారణంగా మహేష్ బాబు, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండలు ఎంత విధేయతతో ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని కొన్ని సార్లు విజయ్ దేవరకొండ ఇక కాస్త అతి చేశాడు అని విమర్శలు ఎదుర్కున్నప్పటికీ మహేష్ మాత్రం ఎంతో సింప్లిసిటీతో ఉంటాడు. ఇక తారక్ అయితే అందరితో కలిసిపోయినట్లు ఫ్యామిలీ మెంబర్ల ఉంటాడు.

 కానీ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండలు ఇలా తెరమీద ఉండేది మొత్తం నకిలీనే వారి లోపల మరో నిజ స్వరూపం ఉంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ వీరేందర్ చావ్లా. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. విజయ్ దేవరకొండ సింపుల్ గా ఉన్నట్లు చూపించుకోవడానికి మూవీ ప్రమోషన్స్ లో చెప్పులతో వచ్చారు.. ఎన్టీఆర్ ఎయిర్పోర్టులో ఎవరో వ్యక్తి ఫోటో తీస్తే అతనిపై సీరియస్ అయ్యారు  ఇక తనను బాలీవుడ్ భరించలేదు అని మహేష్ బాబు అన్నారు అంటూ వీరేందర్ చావ్లా విమర్శలు గుప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: