ఆ ఇద్దరే.. టీమ్ ఇండియాను గెలిపించారా?

praveen
ప్రపంచ కప్ టోర్నీలో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు జరిగిన కూడా ఉత్కంఠ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం రెండు దేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఈ మ్యాచ్ లో ఉత్కంఠను ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందుకే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ను హై వోల్టేజ్ మ్యాచ్ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. పాకిస్తాన్, ఇండియాలో క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో కేవలం ఆసియా కప్ వరల్డ్ కప్ లాంటి టోర్నీలు మాత్రం ఈ రెండు టీమ్స్ మధ్య జరుగుతాయి.

 అయితే ఇటీవల టీ20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఒక ఓవర్ ముగిగానే వర్షం అంతరాయం కలిగించింది. దీంతో దాయాదుల పోరు జరుగుతుందా లేదా అనే విషయంపై అందరిలో ఆందోళన నెలకొంది. అయితే ఈ పోరును చూసేందుకు స్టేడియం మొత్తం అభిమానులతో కిక్కిరిసిపోయింది అని చెప్పాలి. ఇలాంటి సమయంలో వరుణుడు కరుణించడంతో మళ్ళీ మ్యాచ్ మొదలైంది. అయితే వర్షం తర్వాత మ్యాచ్ జరగగా.. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 119 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది. దీంతో ఇన్నాళ్లు వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై ఇండియా పైచేయి సాధించినా.. ఈసారి మాత్రం పరాజ్యం తప్పదు అని అందరూ అనుకున్నారు.

 కానీ టీమ్ ఇండియా ఎలాగోలా గెలవాలని కోరుకునే అభిమానులు కూడా కోట్లలోనే ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే లో స్కోరింగ్ మ్యాచ్లో పాకిస్తాన్ పై అటు టీమిండియా విజయం సాధించింది. ఈ విజయంలో బుమ్రా, హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించారు. మరి ముఖ్యంగా టీమిండియాలో  డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా కొనసాగుతున్న బుమ్రా నాలుగు ఓవర్లలో కేవలం పద్నాలుగు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసాడు. అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. ఇక మరోవైపు హార్థిక్ పాండ్యా 24 రన్స్ ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. వీరిద్దరి విజృంభనతో టీం ఇండియా.. లో స్కోరింగ్ గేమ్ లో కూడా విజయం సాధించగలిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: