దానికి మంచిది మరొకటి లేదు.. కోహ్లీపై రోహిత్ ప్రశంసలు?

praveen
ప్రపంచ క్రికెట్లో అగ్రశ్రేణి జట్టులో ఒకటిగా కొనసాగుతున్న టీమిండియా గత కొంతకాలం నుంచి మాత్రం అటు వరల్డ్ కప్ టైటిల్ గెలవడంలో వెనకబడి పోతుంది అన్న విషయం తెలిసిందే. కెప్టెన్లు మారిన అటు భారత జట్టుకు మాత్రం అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు. అయితే గత ఏడాది దాదాపు టైటిల్ గెలిచినంత పని చేసిన టీమ్ ఇండియా ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి నిరాశపరిచింది. అయితే ఇప్పుడు యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికలుగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ టోర్నిలో ఆడుతుంది టీమిండియా.

 ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ గెలవాలి అనే లక్ష్యంతో ఉంది ఇక ప్రస్తుతం అమెరికాలో ఉన్న టీమ్ ఇండియా అక్కడ వరుసగా మ్యాచ్లు ఆడుతుంది. ఇప్పటికే అటు ఐర్లాండ్ మ్యాచ్లో ఘనవిజయాన్ని అందుకున్న టీమ్ ఇండియా.. ఇటీవల చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో  కూడా లో స్కోరింగ్ గేమ్ లో అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకుంది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం వరల్డ్ కప్ మ్యాచ్ ల నేపథ్యంలో మ్యాచ్ కు ముందు ఆటగాళ్లు అందరూ కూడా వార్మప్ మ్యాచులు ఆడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. టీమిండియా కూడా ఇలాగే వార్మప్ ఒక మ్యాచ్ లు ఆడుతుంది. కానీ భారత జట్టులో కీలక ప్లేయర్లుగా కొనసాగుతున్న కోహ్లీ మాత్రం ఈ వారం మ్యాచ్ లకి దూరంగా ఉంటున్నాడు.

 ఈ క్రమంలోనే ఇలా కోహ్లీ వరుసగా వారం మ్యాచ్లకు దూరంగా ఉండటం పై విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక ఇదే విషయం  గురించి కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వార్మప్ మ్యాచ్ లు ఆడకపోయినప్పటికీ పాకిస్తాన్ తో మ్యాచ్ కు ముందు విరాట్ కోహ్లీకి తగినంత ప్రిపరేషన్ టైం దొరికిందని  రోహిత్ శర్మ తెలిపాడు. అతనికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద టోర్నమెంట్లలో ఆడిన అనుభవం ఉంది అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు. ఇక ఆ అనుభవానికి మించినది ఇంకొకటి లేదు అంటూ రోహిత్ తెలిపాడు. టీం లో ఉన్న ఏ ఒక్కరిని కూడా తాము ఒత్తిడి పెట్టాలి అని అనుకోవట్లేదని.. జట్టు ఆటగాళ్లు అందరూ కూడా తమ వంతు సహకారం అందించాల్సిన అవసరం ఉంది అంటూ రోహిత్ అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: