విరూపాక్ష దర్శకుడితో సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చైతూ..!!

murali krishna
టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ఈ హీరోకు గత కొంత కాలంగా వరుస ఫ్లాప్స్ ఇబ్బంది పెడుతున్నాయి.ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తండేల్” ..నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో క్యూట్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు.చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో దేశభక్తి ప్రధాన అంశాలతో ఈ సినిమా వస్తుండగా.. నాగచైతన్య జాలరి రాజు పాత్రలో నటిస్తుండగా, సాయిపల్లవి ఆయన భార్య బుజ్జమ్మగా కనిపించనుంది. అనూహ్య పరిస్థితుల్లో పాకిస్తాన్‌ సైన్యం చేతిలో బందీ కాబడ్డ భారత జాలరులు అక్కడి నుంచి ఎలా బయట పడ్డారు? దేశభక్తిని గుండెల్లో నింపుకున్న ఆ మత్స్యకారుల బృందం చేసిన సాహసాలేమిటన్నదే ఈ చిత్ర కథాంశం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా సెట్స్‌లో ఉండగానే మరో సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు నాగ చైతన్య.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే తాజాగా నాగ చైతన్య మరో సినిమా లైన్ లో పెట్టినట్లు తెలుస్తుంది.గతేడాది విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు కార్తీక్ దండుతో నాగ చైతన్య మూవీ చేయనున్నట్లు సమాచారం.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు కార్తీక్ చైతూని కలిసి కథ వినిపించగా చైతూ ఓకే చెప్పినట్లు సమాచారం. నాగచైతన్యతో తెరకెక్కించే ఈ సినిమా ఏ జోనర్ లో రాబోతుందో మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నట్లు సమాచారం.అయితే నాగచైతన్య ఈ సినిమాతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని ఈ సినిమాని SVCC నిర్మిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: